Sprouts Benefits : మొలకెత్తిన గింజలను ఎందుకు తినాలో తెలుసా..?

Sprouts Benefits : మొలకెత్తిన గింజలను ఎందుకు తినాలో తెలుసా..?

మొలకలు ప్రయోజనాలు : మారిన ఆహారపు అలవాట్ల వల్ల అనేక ఆరోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతున్నాయి. అందుకే, ఆరోగ్య సమస్యల బారి నుంచి బయటపడేందుకు, అవి మన దరిచేరకుండా ఉండేందుకు చాలా ఆహారపు అలవాట్లను మార్చుకున్నారు.

మంచి పౌష్టికాహారం, నూనె లేని ఆహారం తీసుకోవడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే మనలో చాలా మంది మొలకెత్తిన విత్తనాలు తింటున్నాం. వాటిని ఉదయం అల్పాహారంలో భాగంగా లేదా స్నాక్స్‌గా తీసుకుంటారు. మొలకెత్తిన విత్తనాలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. వీటిని ఆహారంగా కూడా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

మొలకెత్తిన గింజలను ఆహారంగా ఎందుకు తీసుకోవాలి.. వాటిని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో.. మొలకెత్తిన గింజల్లో సాధారణం కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వీటిని తీసుకోవడం వల్ల అధిక బరువును దూరం చేసుకోవచ్చు. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అధిక రక్తపోటును సులభంగా నయం చేయవచ్చు. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటి వ్యాధులకు దూరంగా ఉంటాం. చర్మం మరియు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వృద్ధాప్య ఛాయలు మన దరి చేరవు.

మొలకలు ప్రయోజనాలు

శరీరంలోని అవయవాలకు రక్తం, ఆక్సిజన్ సక్రమంగా అందుతాయి. మొలకెత్తిన గింజలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. శరీరం శుద్ధి అవుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే మొలకెత్తిన గింజలను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన ప్రొటీన్లతో పాటు వివిధ రకాల పోషకాలు కూడా అందుతాయి. ప్రొటీన్ లోపంతోపాటు పోషకాహార లోపం వంటి సమస్యలు దూరమవుతాయి. ఈ మొలకెత్తిన విత్తనాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రతి ఒక్కరూ ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Flash...   Departmental Tests November 2020 Result in Us Formats