ఎల్పీజీ గ్యాస్ వాడేవారికి  శుభవార్త.. ఇకపై వారికికూడా సబ్సిడీ ..?

ఎల్పీజీ గ్యాస్ వాడేవారికి  శుభవార్త.. ఇకపై వారికికూడా సబ్సిడీ ..?

గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల వినియోగం బాగా పెరిగిన సంగతి తెలిసిందే. ఇక ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరటనిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే ఆగస్టు నెలాఖరులో సిలిండర్ ధరలను భారీగా తగ్గించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది సామాన్యులు ఉపశమనం పొందారు. ముఖ్యంగా సిలిండర్ ధర రూ.200 తగ్గడం గమనార్హం.

దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ గ్యాస్ సిలిండర్ల ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం ఏపీ, తెలంగాణల్లో గ్యాస్ సిలిండర్ ధరలు రూ.960 స్థాయిలో ఉండడం గమనార్హం. కాకపోతే దీని నుంచి సామాన్యులకే కాకుండా చాలా మందికి ఉపశమనం కలుగుతుంది. అలాగే కొంత మందికి అదనపు ప్రయోజనాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. పీఎం ఉజ్వల పథకం కింద గ్యాస్ సిలిండర్ కనెక్షన్ పొందిన వారికి రూ.200 మేర అదనపు సబ్సిడీ లభిస్తుంది. అంటే ఉజ్వల పథకం కింద సిలిండర్ తీసుకున్న వారికి రూ.400 తగ్గింపు లభిస్తుంది.

అంటే రూ.760కే ఈ గ్యాస్ సిలిండర్ ను పొందుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే, ఇది చాలా ఉపశమనం. అయితే మరికొద్ది రోజుల్లో ఈ రూ.200 సబ్సిడీ ప్రయోజనం ఏపీ తెలంగాణలో మరికొంత మందికి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు పొందిన సంగతి తెలిసిందే. వీరంతా కలిపి 85 లక్షలు. అయితే దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్ పొందిన వారికి రూ.200 సబ్సిడీ అందడం లేదు. అందుకే వారికి కూడా సబ్సిడీ అందేలా చూడాలన్న డిమాండ్ వినిపిస్తోంది. త్వరలో వారికి కూడా సబ్సిడీ అందించే అవకాశాలు ఉన్నాయి.

Flash...   Andhra Pradesh's income shortfall takes off 662% in H1