TCS: కంపెనీలో 40వేల మందికి ఫ్రెషర్లకు ఛాన్స్

TCS: కంపెనీలో 40వేల మందికి ఫ్రెషర్లకు ఛాన్స్

టీసీఎస్: సాఫ్ట్‌వేర్ కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగం కోసం చూస్తున్నా.. అయితే మీకు సువర్ణావకాశం. ప్రముఖ ఐటీ కంపెనీ TCS మిమ్మల్ని ఆహ్వానిస్తోంది. సీనియర్లతో పాటు.. ఫ్రెషర్లకు కూడా పెద్ద ఎత్తున అవకాశాలు కల్పించనున్నారు. టీసీఎస్ సీఈవో ఎన్.గణపతి సుబ్రమణియన్ క్యాంపస్ నుంచి పెద్దఎత్తున రిక్రూట్‌మెంట్లు చేస్తామని ప్రకటించారు. అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనీసం 40,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు టీసీఎస్ తెలిపింది.

ఈ ఏడాదే కాదు.. ఏటా 35 వేల నుంచి 40 వేల మంది ఫ్రెషర్లకు టీసీఎస్ కంపెనీ ఉపాధి కల్పిస్తోంది. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించబోమని సుబ్రమణియన్ తెలిపారు. క్యాంపస్ రిక్రూట్‌మెంట్ పట్ల తాము సానుకూలంగా ఉన్నామని, ఇతర ఐటీ కంపెనీలు మాత్రం అందుకు భిన్నమైన విధానాన్ని అనుసరిస్తున్నాయని చెప్పారు. గత ఏడాది 50,000 మంది ఫ్రెషర్లను తీసుకున్నామని ఇటీవల ఇన్ఫోసిస్ సీఎఫ్ నీలాంజన్ రాయ్ తెలిపారు. డిమాండ్ పరిస్థితులు పెరిగే వరకు క్యాంపస్ రిక్రూట్‌మెంట్లు (ఐటీ సర్వీసుల కోసం) చేపట్టబోమని చెప్పారు.

నిజానికి డిమాండ్ పరిస్థితులకు అనుగుణంగా ఐటీ కంపెనీలు ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకుంటాయి. ఇందుకు టీసీఎస్ మినహాయింపు కాదని సీవోఏ తెలిపారు. కానీ గత 12-24 నెలల్లో ఉద్యోగుల వలసల రేటు ఎక్కువగా ఉందని, అందుకే సాధారణం కంటే ఎక్కువ మందిని నియమించాలని ఆలోచిస్తున్నామని చెప్పారు.

Flash...   PRC పై ఉత్కంఠ.. ఉద్యోగ సంఘాలతో మరోసారి భేటీ కానున్న ఏపీ ప్రభుత్వం