కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ దసరా కానుక

కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ దసరా కానుక

ఏపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ గెజిట్ విడుదల చేశారు

కాంట్రాక్టు ఉద్యోగుల చిరకాల కోరికను సీఎం జగన్ నెరవేర్చారు. వివిధ శాఖల్లో దాదాపు 10,117 మంది పూర్తిస్థాయి కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశారు. వీలైనంత ఎక్కువ మందికి లబ్ధి చేకూరేలా సీఎం జగన్ 2-6-2014కు ముందు ఐదేళ్ల సర్వీసు నిబంధనలను సడలించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినందుకు సీఎంకు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Flash...   ఏపీ కరోనా కల్లోలం: 7వేలు దాటిన కేసులు..