రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇకపై సాధారణ టిక్కెట్ల కోసం ప్రయాణికులు లైన్లలో క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. అన్‌రిజర్వ్‌డ్ టిక్కెట్లు అంటే సాధారణ టిక్కెట్‌లను కొనుగోలు చేయడానికి దక్షిణ మధ్య రైల్వే కొత్త మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది.
UTS అంటే అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ నెల వరకు అన్‌రిజర్వ్డ్ టిక్కెట్ బుకింగ్ సిస్టమ్ (UTS) మొబైల్ యాప్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో 14.8% సాధారణ టిక్కెట్‌ల విక్రయాన్ని సాధించింది. ఈ యాప్ ద్వారా టిక్కెట్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దక్షిణ మధ్య రైల్వే ఈ యూటీఎస్ యాప్ ద్వారా జనరల్ టిక్కెట్లు, ఫ్లాట్ ఫాం టికెట్లు, సీజన్ టిక్కెట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది.
ఎలా బుక్ చేసుకోవాలి..
- స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రయాణికులు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యూటీఎస్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
- పేరు, ఫోన్ నంబర్, పాస్‌వర్డ్ వంటి వివరాలను నమోదు చేయండి.
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP పంపబడుతుంది. ఈ OTPని నమోదు చేస్తే, మన ఖాతా UTS యాప్‌లో నమోదు చేయబడుతుంది.
- యాప్‌ని తెరిచి, ఫోన్ నంబర్ మరియు పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయండి.
- సాధారణ టిక్కెట్లు, సీజన్ టిక్కెట్లు మరియు ఫ్లాట్ ఫారమ్ టిక్కెట్ల కేటగిరీలు యాప్‌లో అందుబాటులో ఉన్నాయి.
- సాధారణ టికెట్‌ను సాధారణ బుకింగ్ ఆప్షన్‌లో కొనుగోలు చేయాలి.
- ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నాం..ఎంత మంది ఉన్నారు..ఎంత మంది పిల్లలు, పెద్దలు పొందాలి.
- క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ మరియు డిజిటల్ చెల్లింపుల ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేయవచ్చు.
షో టికెట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే..బుకింగ్ వివరాలన్నీ డిస్ ప్లే అవుతాయి. దీన్ని డౌన్‌లోడ్ చేసి, ప్రయాణ సమయంలో TC లకు ఈ టిక్కెట్‌ను చూపించండి.
ఏ రోజు ప్రయాణం చేయాలంటే ఆ రోజున జనరల్ టికెట్ కొనాలి.