UCIL : యురేనియం కార్పొరేషన్‌లో 243 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే

UCIL : యురేనియం కార్పొరేషన్‌లో 243 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే

UCIL ట్రేడ్ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్ 2023: వివిధ ట్రేడ్‌లలో ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి UCIL నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి నవంబర్ 12 చివరి తేదీ.

ముఖ్యాంశాలు:

  • UCIL జాబ్ రిక్రూట్‌మెంట్ 2023
  • 243 అప్రెంటీస్ ఖాళీల భర్తీకి ప్రకటన
  • దరఖాస్తులకు నవంబర్ 12 చివరి తేదీ

UCIL రిక్రూట్‌మెంట్ 2023 : యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCIL), జార్ఖండ్ ప్రాంతంలోని జాదుగూడ మైన్స్‌లోని ఒక భారతీయ ప్రభుత్వ రంగ సంస్థ, ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 243 అప్రెంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులకు నవంబర్ 12 చివరి తేదీ. వివరాల్లోకి వెళితే..

మొత్తం ఖాళీలు : 243

  • ఎలక్ట్రీషియన్: 82
  • ఫిట్టర్: 82
  • వెల్డర్ 40
  • టర్నర్/ మెషినిస్ట్: 12
  • మెకానిక్ (డీజిల్/ MV): 12
  • ప్లంబర్: 05
  • కార్పెంటర్: 05

ముఖ్య సమాచారం:

ట్రేడ్ అప్రెంటిస్‌షిప్: 243 ఖాళీలు

యూనిట్ల వారీగా ఖాళీలు: జాదుగూడ యూనిట్- 102, నర్వాపహార్ యూనిట్- 51, తురందిహ్ యూనిట్- 90 ఖాళీలు.

ట్రేడ్‌లు:

ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ (గ్యాస్ మరియు ఎలక్ట్రిక్), టర్నర్/ మెషినిస్ట్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెకానిక్ (డీజిల్/ MV), కార్పెంటర్, ప్లంబర్ మొదలైనవి.

అర్హత:

మెట్రిక్యులేషన్/ 10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయోపరిమితి:

13.10.2023 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

ITI/10th  మొదలైన వాటిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • దరఖాస్తులు Open Date: అక్టోబర్ 13, 2023
  • దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 12, 2023

పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ucil.gov.in/

Flash...   LESSON PLANS: లెసన్ ప్లాన్స్ లేని ఉపాధ్యాయులపై క్రమశి క్షణ చర్యలు