విటమిన్‌ డి కి క్యాన్సర్‌కు సంబంధం ఏంటి.? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

విటమిన్‌ డి కి క్యాన్సర్‌కు సంబంధం ఏంటి.? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే Vitaminలు అవసరమని తెలిసిందే. ఈ Vitamin లోపిస్తే వెంటనే శరీరంలో మార్పులు వస్తాయి. Vitamin డి శరీరానికి అత్యంత ఉపయోగకరమైన Vitaminలలో ఒకటి.
సాధారణంగా మనం Vitamin డి లోపం ఎముకలకు సంబంధించినదని అనుకుంటాం.

రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేయడంలో Vitamin D కీలక పాత్ర పోషిస్తుంది. Vitamin D లోపం తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. ఇటీవల సూర్యరశ్మి సరిగా లేకపోవడంతో Vitamin D లోపంతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అపార్ట్ మెంట్ లలో నివసించడం, నైట్ షిఫ్ట్ డ్యూటీల వల్ల Vitamin D లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నారు.దీంతో కీళ్ల నొప్పులు వంటి సమస్యలు వస్తున్నాయి. అయితే Vitamin D లోపం వల్ల అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా?

Vitamin D లోపం వల్ల ఎముకలు క్షీణిస్తాయి. దీని వల్ల ఎముకలు త్వరగా విరిగిపోయే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. Vitamin D లేకపోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.కొన్ని అధ్యయనాల ప్రకారం Vitamin D లోపం వల్ల గుండె జబ్బులు వస్తాయని తేలింది. దీర్ఘకాలిక గుండె వైఫల్యంతో బాధపడుతున్న చాలా మందిలో Vitamin D లోపం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో Vitamin D పెంచుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచించారు.

Vitamin D లోపం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. Vitamin D లోపం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, అన్నవాహిక, గ్యాస్ట్రిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. పలువురిపై పరిశోధనలు చేసిన తర్వాత ఈ విషయాలు వెల్లడయ్యాయి.

Vitamin D లోపాన్ని తెలుసుకోవడం ఎలా..

వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, సూర్యరశ్మికి గురికావడం ద్వారా శరీరంలో Vitamin D లోపానికి చెక్ పెట్టవచ్చు. అయితే, Vitamin D లోపాన్ని ఆహారం ద్వారా సరిదిద్దవచ్చు. Vitamin D లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. ఎముకల నొప్పి, తరచూ బలహీనత, అలసట, కండరాలు తిమ్మిర్లు, ఎముకలు విరగడం వంటివి Vitamin D లోపానికి సూచనలని నిపుణులు చెబుతున్నారు.

Flash...   TS: టీచర్ల ఆస్తులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు - వెంటనే నిలిపివేస్తూ ప్రభుత్వ ఆదేశాలు