భారత్‌ గెలిస్తే 100 కోట్లు పంచుతా! కంపెనీ CEO బంపర్‌ ఆఫర్‌ !

భారత్‌ గెలిస్తే 100 కోట్లు పంచుతా!  కంపెనీ CEO బంపర్‌ ఆఫర్‌ !

CIRICKET WORLD CUP 2023: భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫైనల్లో మూడోసారి నెగ్గి మెగా కప్ ను ముద్దాడాలని టీమ్ ఇండియా ఆశగా ఉంది. ఇందుకోసం కొందరు పూజలు, యాగాలు చేస్తున్నారు. తాజాగా ఓ ఆస్ట్రాలజీ కంపెనీ సీఈవో… భారత్ గెలవాలని కోరుకుంటూ… తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఫైనల్లో భారత్ గెలిస్తే రూ.100 కోట్లు పంపిణీ చేస్తానని ‘ఆస్ట్రోటాక్’ సీఈవో పునీత్ గుప్తా తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటించారు. 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను. ఆ రోజు నేను నా స్నేహితులతో కలిసి ఆడిటోరియంలో మ్యాచ్ చూశాను. మ్యాచ్‌లో టెన్షన్‌ పడ్డాం. ఆ టోర్నీలో టీమిండియా గెలిచిన తర్వాత.. నా ఆనందానికి అవధులు లేవు. ఇప్పుడు మళ్లీ టీమ్ ఇండియా ఫైనల్ చేరింది. ఈసారి భారత్ గెలిస్తే ఏం చేయాలి? చాలా సేపు ఆలోచించాను. అప్పుడు నా సంతోషాన్ని పంచుకోవడానికి నాకు కొంతమంది స్నేహితులు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మా ఆస్ట్రోటాక్ వినియోగదారులందరూ నా స్నేహితులు. నా ఆనందాన్ని వారితో పంచుకోవాలనుకుంటున్నాను. భారత్ ప్రపంచకప్ గెలిస్తే మా సంస్థ రూ.100 కోట్లను వినియోగదారులందరికీ సమానంగా పంపిణీ చేస్తుందని పునీత్ గుప్తా తన పోస్ట్ లో వెల్లడించారు.

ప్రతి క్రికెటర్ కోసం ఒక ప్లాట్: BJP  నాయకుడు

గాంధీనగర్‌: ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత క్రికెట్‌ జట్టు గెలిస్తే కోచ్‌తో సహా జట్టులోని ప్రతి ఒక్కరికీ 16 ప్లాట్లు ఉచితంగా ఇస్తామని గుజరాత్‌కు చెందిన బీజేపీ నేత కెయూర్ ధోలారియా ప్రకటించారు. రాజ్‌కోట్‌లోని భయసర్-ఖత్రోత్ శివరామ్ జెమినీ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ప్లాట్లను ఇవ్వనున్నట్లు తెలిపారు. వీటి విలువ ఒక్కోటి రూ.10 లక్షలు ఉంటుందని తెలిపారు.

Flash...   నార్మల్ పెట్రోల్, పవర్ పెట్రోల్ మధ్య తేడాలేంటి? - ఏది మంచిదో ఇప్పుడే తెలుసుకోండి!