డిగ్రీ అర్హతతో పోస్టల్ శాఖలో 1899 పోస్టుల భర్తీ.. అర్హులు వీళ్ళే ..

డిగ్రీ అర్హతతో పోస్టల్ శాఖలో 1899 పోస్టుల భర్తీ.. అర్హులు వీళ్ళే ..

Postal Recruitment 1899 posts: : పోస్టల్ శాఖలో భారీ వేతనంతో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో ఇంటర్, డిగ్రీ అర్హతతో స్పోర్ట్స్ కోటా కింద 1,899 పోస్టులను భర్తీ చేస్తారు. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టులకు వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కనబర్చిన అభ్యర్థులు శుక్రవారం (నవంబర్ 10) నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లోనిముఖ్యాంశాలు..

Post Details

  • పోస్టల్ అసిస్టెంట్ 598,
  • సార్టింగ్ అసిస్టెంట్ 143,
  • పోస్ట్ మ్యాన్ 585,
  • మెయిల్ గార్డ్స్ 3,
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) 570

పోస్టులు ఉన్నాయి.

ఆన్‌లైన్ దరఖాస్తులను నవంబర్ 10 నుంచి డిసెంబర్ 9 వరకు స్వీకరిస్తామని.. డిసెంబర్ 10 నుంచి 14 వరకు దరఖాస్తులను సవరించుకునే వెసులుబాటును కల్పిస్తామన్నారు.

దరఖాస్తు రుసుము జనరల్/OBC అభ్యర్థులకు రూ.100; SC/ST/PWD/EWS/మహిళలు ఎలాంటి దరఖాస్తు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు.

తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు:

AP లో 27 పోస్టల్ అసిస్టెంట్,

2 సార్టింగ్ అసిస్టెంట్,

15 పోస్ట్ మ్యాన్,

17 ఎంటీఎస్ పోస్టులను

భర్తీ చేయాల్సి ఉంది.

తెలంగాణలో 16 పోస్టల్ అసిస్టెంట్,

5 సార్టింగ్ అసిస్టెంట్,

20 పోస్ట్‌మ్యాన్,

2 మెయిల్‌గార్డ్,

16 MTS ఉద్యోగాలు ఉన్నాయి.

వేతనం: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ (లెవల్ 4) వేతన పరిధి రూ.25,500 – రూ.81,100గా నిర్ణయించబడింది.

అలాగే, పోస్ట్‌మ్యాన్, మెయిల్‌గార్డ్ (లెవల్ 3) రూ. 21,700, – 69,100 చొప్పున;

మల్టీ టాస్కింగ్ సిబ్బందికి (లెవల్ 1) రూ.18000 నుండి రూ.59,900 చొప్పున చెల్లిస్తారు.

వయోపరిమితి: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డ్ పోస్టులకు వయోపరిమితి 18 నుంచి 27 ఏళ్లుగా నిర్ణయించారు. ఆయా వర్గాలకు రిజర్వేషన్ల ఆధారంగా వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అర్హతలు.. పోస్టల్ అసిస్టెంట్/సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు పోస్టల్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న క్రీడల్లో విద్యార్హతతోపాటు ఏదైనా డిగ్రీ ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. అలాగే పోస్ట్ మ్యాన్/మెయిల్ గార్డ్ పోస్టులకు కంప్యూటర్ పరిజ్ఞానంతోపాటు ఇంటర్ విద్యార్హతతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి.

Flash...   SJVN: డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతతో 400 ఉద్యోగాలు…