AP AHD : ఏపీ- రాయలసీమ జిల్లాల్లో 1035 ప్రభుత్వ ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

AP AHD : ఏపీ- రాయలసీమ జిల్లాల్లో 1035 ప్రభుత్వ ఉద్యోగాలు..   ఇలా అప్లై చేయండి

AP AHD రిక్రూట్‌మెంట్ 2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. పశుసంవర్థక శాఖలో 1035 పశుసంవర్ధక సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నారు. అందులో రాయలసీమలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో 1035 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 20 నుంచి ప్రారంభమైంది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 12 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డిసెంబర్ 27న హాల్ టిక్కెట్లు జారీ చేస్తారు. డిసెంబర్ 31న కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి జనవరిలో నియామక పత్రాలు అందజేయనున్నారు. అర్హత, ఎంపిక విధానం, ముఖ్యమైన తేదీలు వంటి పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్, అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేయవచ్చు.

రాయలసీమ జిల్లాల వారీగా ఖాళీలు

  • అనంతపురం జిల్లా – 473
  • చిత్తూరు జిల్లా – 100
  • కర్నూలు జిల్లా – 252
  • వైఎస్ఆర్ కడప జిల్లా – 210

ముఖ్య సమాచారం:

విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పశుసంవర్ధక విభాగంలో రెండేళ్ల పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే..డైరీ అండ్ పౌల్ట్రీ విభాగంలో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు లేదా పౌల్ట్రీ విభాగంలో రెండేళ్ల డిప్లొమా లేదా డెయిరీ విభాగంలో రెండేళ్ల ఇంటర్మీడియట్ కోర్సు లేదా బీఎస్సీ (డైరీ సైన్స్), ఎమ్మెస్సీ (డైరీ సైన్స్), బీటెక్ (డెయిరీ టెక్నాలజీ) , డిప్లొమా వెటర్నరీ సైన్స్, డిప్లొమా ఇన్ డైరీ ప్రాసెసింగ్, డిప్లొమా ఇన్ వెటర్నరీ సైన్స్ మరియు ఇతర కోర్సులు చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: అభ్యర్థుల వయస్సు జూలై 1, 2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ఆధారంగా వయోపరిమితిలో కొంత సడలింపు ఉంటుంది.

జీతం: ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్లపాటు ప్రొబేషన్ సమయంలో రూ.15,000 కన్సాలిడేషన్ పే చెల్లించబడుతుంది. ఆ తర్వాత జీతం రూ.22,460 నుంచి రూ.72,810 వరకు ఉంటుంది.

Flash...   Govt. Guidelines on Student Suicides: ఆత్మహత్యల నివారణకు మార్గదర్శకాలు జారీ!

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు కంప్యూటర్ ఆధారిత వ్రాత పరీక్ష (CBT) ద్వారా ఎంపిక చేయబడతారు.

ఎలా దరఖాస్తు చేయాలి: ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ.500, ఇతర అభ్యర్థులకు రూ.1000.

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: నవంబర్ 20, 2023

ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము చెల్లించడానికి చివరి తేదీ: డిసెంబర్ 10, 2023

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 11, 2023

పరీక్ష హాల్ టిక్కెట్‌ల విడుదల తేదీ: డిసెంబర్ 27, 2023

CBT పరీక్ష తేదీ: డిసెంబర్ 31, 2023

Official Website: https://ahd.aptonline.in/