AP Govt : VRO లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

AP Govt : VRO  లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌

ఏపీ ప్రభుత్వం: వీఆర్వోలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. వీఆర్వోల కోసం జగన్ సర్కార్ ప్రత్యేక GOs తీసుకొచ్చింది. ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షుడు భూపతి రాజు రవీంద్రరాజు మాట్లాడుతూ వీఆర్వోలకు ప్రభుత్వం GO 154, GO 64, GO 6538, GO 166, GO 31 జీవోలు జారీ చేసిందన్నారు.

వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపేందుకు త్వరలో రాష్ట్ర స్థాయిలో విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

వీఆర్వోలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త

ఎపి గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం సమావేశంలో రవీంద్రరాజు మాట్లాడారు. రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ పదోన్నతుల్లో వీఆర్వోలకు ప్రస్తుతం ఉన్న కోటాను 40% నుంచి 70%కి పెంచాలి. అలాగే ఖాళీగా ఉన్న 70% సీనియర్ అసిస్టెంట్ పోస్టులను వన్ టైమ్ సెటిల్‌మెంట్ ప్రకారం VROలతో భర్తీ చేయాలని కోరింది. సర్వే సప్లిమెంటరీ పరీక్షలు రాసిన గ్రేడ్-2 వీఆర్వోల ఫలితాలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాన్ని గుర్తింపు సంఘంగా ఎంపిక చేయాలని ప్రభుత్వానికి విన్నవించామన్నారు.

Flash...   HMFW: జిల్లా వైద్యారోగ్యశాఖలో గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...