Avocado Oil for Skin: రాత్రి పడుకునే ముందు ఈ నూనెను ముఖంపై రాస్తే స్కిన్ సమస్యలన్నీ దూరం!

Avocado Oil for Skin: రాత్రి పడుకునే ముందు  ఈ నూనెను ముఖంపై రాస్తే స్కిన్ సమస్యలన్నీ దూరం!

అవకాడో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దీని గురించి అందరికీ తెలుసు. అవకాడోలో చాలా ఉపయోగకరమైన పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ ఎ, బి, బి6, సి, ఇ, కె, మెగ్నీషియం, నియాసిన్, సోడియం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలిక్ యాసిడ్, మోనో శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా, అవకాడోలో మంచి సౌందర్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవోకాడోను సీరమ్‌లు, మాస్క్‌లు, మాయిశ్చరైజర్లు మరియు క్రీమ్‌ల తయారీలో ఉపయోగిస్తారు. అవకాడో నూనెను నేరుగా చర్మానికి ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మాయిశ్చరైజ్ చేస్తుంది: అవకాడో నూనెను చర్మంపై అప్లై చేయడం వల్ల చర్మం తేమగా మరియు మృదువుగా మారుతుంది. విటమిన్ ఇ మరియు పొటాషియం వంటి పోషకాలు చర్మాన్ని మృదువుగా మరియు తేమగా మార్చడంలో సహాయపడతాయి. సహజంగానే, ఈ నూనెలో తేమను పెంచే అంశాలు ఉంటాయి.

మొటిమలకు చెక్: అవకాడో ఆయిల్ అప్లై చేయడం వల్ల మొటిమలు త్వరగా తగ్గుతాయి. రాత్రిపూట అవకాడో నూనెను రాసుకుని సున్నితంగా మసాజ్ చేయాలి. ఉదయాన్నే నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు త్వరగా పోతాయి.

యవ్వనంగా ఉంచుతుంది: ఈ నూనెను పూయడం వల్ల కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల యవ్వనంగా కనిపిస్తారు. వృద్ధాప్య చర్మాన్ని నివారించడంలో అవకాడో ఆయిల్ బాగా పనిచేస్తుంది.

జుట్టుకు కూడా మంచిది: అవకాడో ఆయిల్ చర్మానికి మాత్రమే కాకుండా జుట్టుకు కూడా పోషణనిస్తుంది. ఈ నూనెలోని విటమిన్ బి మరియు ఐ జుట్టుకు సహజమైన మాయిశ్చరైజింగ్‌ను అందిస్తాయి. అంతే కాకుండా మసాజ్ చేస్తే వేర్లు బలంగా తయారవుతాయి.

Flash...   మరో వారం రోజులు ఎండలు ఇంతే.. భగ భగలకు కారణమిదే!