SBI JOBS : హైదరాబాద్ SBI లో 525 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి ..

SBI JOBS : హైదరాబాద్ SBI లో 525 ఉద్యోగాలకు నోటిఫికేషన్..  ఇలా అప్లై చేయండి ..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా 8283 జూనియర్ అసోసియేట్స్ (Clerical Cadre) ఉద్యోగాల భర్తీని ప్రకటించింది. వీటిలో 525 ఖాళీలు హైదరాబాద్‌లో ఉన్నాయి.

నోటిఫికేషన్ ప్రకారం, ఏదైనా డిగ్రీ ఉన్న అభ్యర్థులు లేదా చివరి సంవత్సరం/సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

పోస్టులకు దరఖాస్తు చేయడానికి దరఖాస్తుదారులు తప్పనిసరిగా 20 – 28 సంవత్సరాల మధ్య ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 750 దరఖాస్తు రుసుము చెల్లించాలి. అయితే, SC/ST/PWD అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుండి మినహాయింపు ఉంది. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు ఆన్‌లైన్‌లో నిర్వహించనుండగా, ఈ పోస్టులకు దరఖాస్తుల సమర్పణకు డిసెంబర్ 7 చివరి తేదీ.

SBI తాత్కాలికంగా జూనియర్ అసోసియేట్ ప్రిలిమినరీ పరీక్షను జనవరి 2024లో నిర్వహించాల్సి ఉంది, మెయిన్స్ పరీక్ష ఫిబ్రవరి 2024లో జరగనుంది. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను సందర్శించండి.

ఉద్యోగ సమగ్ర ప్రకటన మరియు వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి

Flash...   AP DWCWE Jobs: ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవే..