- తిరుపతిలో సంచరిస్తున్న ముఠా
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
- రాత్రి కాలింగ్ బెల్ మోగించినా లేదా తలుపు తట్టినా
స్పందించవద్దన్నపోలీసులు
తాజాగా ఏపీని వణికించిన చెడ్డీగ్యాంగ్ మరోసారి కలకలం సృష్టించింది. ఈ ముఠా తిరుపతి, శివారు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రజలకు పలు హెచ్చరికలు జారీ చేశారు. చెడ్డీగ్యాంగ్ సంచరిస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాత్రి సమయాల్లో కాలింగ్ బెల్ కొట్టినా, తలుపులు తట్టినా ఎట్టి పరిస్థితుల్లోనూ తీయవద్దని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు ఫోన్ చేయాలని సూచించారు.
మూడేళ్లుగా రాష్ట్రంలో చెడ్డీగ్యాంగ్ సంచరిస్తోంది. 2021లో తిరుపతిలోని విద్యానగర్‌లో చోరీకి విఫలయత్నం చేసింది. గతేడాది తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని బృందావన్ కాలనీలోని ఓ ఇంట్లోకి చొరబడి చోరీ చేసింది. తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. వారు సంచరిస్తున్న సమయంలో రికార్డయిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేశారు.
చెడ్డీ గ్యాంగ్ దొంగలున్నారు జాగ్రత్త, తిరుపతి జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరిక#CheddiGang #Tirupati #APnews#TirupatiPolice pic.twitter.com/4pxIMWOxvu
— ABP Desam (@ABPDesam) November 11, 2023