ఈ వాణిజ్య సైట్ల విస్తరణ తర్వాత, క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. ఆన్‌లైన్ సైట్‌లు క్రెడిట్ కార్డ్‌లపై భారీ తగ్గింపులు మరియు క్రెడిట్ కార్డ్‌తో EMI ఎంపికను అందించడంతో ఎక్కువ మంది క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నారు. డెబిట్ కార్డులతో పోలిస్తే క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే క్రెడిట్ కార్డుల వినియోగం ఎక్కువ…
Credit Cards వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. Banks మధ్య పోటీ నేపథ్యంలో క్రెడిట్ కార్డులు చాలా సులభంగా జారీ అవుతున్నాయి. ఉద్యోగులతో పాటు, వ్యాపారులకు కూడా బ్యాంకులు క్రెడిట్ కార్డులను అందిస్తాయి. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించే వారికి అనూహ్యంగా పరిమితిని పెంచుతున్నారు.
ఈ వాణిజ్య సైట్ల విస్తరణ తర్వాత, క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. ఆన్‌లైన్ సైట్‌లు క్రెడిట్ కార్డ్‌లపై భారీ తగ్గింపులు మరియు క్రెడిట్ కార్డ్‌తో EMI ఎంపికను అందించడంతో ఎక్కువ మంది క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగిస్తున్నారు. డెబిట్ కార్డులతో పోలిస్తే క్రెడిట్ కార్డుల వినియోగం పెరగడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే.. ఇటీవల క్రెడిట్ కార్డుల వినియోగం బాగా పెరిగిపోయిందని ఓ నివేదిక వెల్లడించింది.
అక్టోబర్‌లో Credit Card ఖర్చు 38.3 % పెరిగి All time గరిష్ఠానికి చేరుకుంది. ఒక్క నెలలోనే 1.8 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుందని గణాంకాలు చెబుతున్నాయి. అక్టోబర్ నెలలో వరుస పండుగల కారణంగా FLIPKART, AMAZON వంటి ఈ-కామర్స్ సైట్‌లు భారీ తగ్గింపులను ఆఫర్ చేయడంతో CREDIT CARD లావాదేవీలు పెరిగాయి. గత తొమ్మిది నెలలతో పోలిస్తే అక్టోబర్ నెలలో క్రెడిట్ కార్డులు ఎక్కువగా ఉపయోగించబడ్డాయి. గతేడాది అక్టోబర్‌తో పోలిస్తే ఇది 38.3 శాతం ఎక్కువ.
గడిచిన రెండేళ్లలో, నెలవారీగా, అక్టోబర్‌లో క్రెడిట్ కార్డుల వినియోగం 25.4 % పెరిగిందని నివేదిక వెల్లడించింది. ఒకే కార్డుపై సగటున 16 % ఖర్చులు పెరిగినట్లు గుర్తించారు. ఈ లెక్కన OCTOBER నెలలో ఒక్క క్రెడిట్ కార్డుపై సగటున రూ.18,989 ఖర్చయింది. దీన్ని బట్టి క్రెడిట్ కార్డుల వినియోగం ఏ మేరకు పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఆన్‌లైన్ చెల్లింపుల్లో 65 % క్రెడిట్ కార్డులదే. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుల వినియోగం 20.3 % పెరుగుతుంది. ఈ లావాదేవీల విలువ రూ. 45, 296 కోట్లు.
తర్వాత, SBI క్రెడిట్ కార్డుల ధర 52 శాతం పెరిగి రూ. 35, 459 కోట్లు. కాగా, Rupay క్రెడిట్ కార్డులను UPI చెల్లింపులతో అనుసంధానం చేసుకునే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.