DWCWE: డిగ్రీ అర్హత తో జిల్లాలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులు, అర్హతలివే

DWCWE: డిగ్రీ అర్హత తో జిల్లాలో ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టులు, అర్హతలివే

DWCWE పల్నాడు రిక్రూట్‌మెంట్:

నరసరావుపేటలోని జిల్లా మహిళా, శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి కార్యాలయం పల్నాడు జిల్లాలో కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్, బ్లాక్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

సంబంధిత విభాగాల్లో డిగ్రీ లేదా పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు తమ దరఖాస్తులను నవంబర్ 28లోపు ఆఫ్‌లైన్ మోడ్‌లో సమర్పించాలి. దరఖాస్తుల నుండి షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు తుది ఎంపిక కోసం ఇంటర్వ్యూ చేయబడతారు.

వివరాలు..

ఖాళీల సంఖ్య: 10 పోస్ట్‌లు

  • ప్రాజెక్ట్ అసిస్టెంట్: 01 పోస్ట్

అర్హత: డిగ్రీ/పీజీ డిప్లొమా (మేనేజ్‌మెంట్/సోషల్ సైన్సెస్/న్యూట్రిషన్).

అనుభవం: కనీసం 2 సంవత్సరాలు. అదేవిధంగా సామాజిక కార్యక్రమాల నిర్వహణలో మూడేళ్ల అనుభవం ఉండాలి. స్థానిక భాషలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆంగ్ల భాషపై పట్టు ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: రూ.18,000.

  • బ్లాక్ కోఆర్డినేటర్: 09 పోస్ట్‌లు

అర్హత: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

అనుభవం: టెక్నాలజీ మరియు సాఫ్ట్‌వేర్ విభాగాల్లో కనీసం 2 సంవత్సరాల అనుభవం. స్థానిక భాషలో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఆంగ్ల భాషపై పట్టు ఉండాలి. ఏదైనా సామాజిక అభివృద్ధి కార్యక్రమంలో ఫ్రంట్‌లైన్ వర్కర్‌గా పనిచేసి ఉండాలి.

వయోపరిమితి: 01.07.2023 నాటికి 25 – 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం: రూ.20,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తును వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తును నింపి, అవసరమైన అన్ని డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను జతచేసి, నిర్ణీత గడువులోగా సంబంధిత చిరునామాకు పంపాలి.

ఎంపిక ప్రక్రియ: అర్హతలు, అనుభవం, రిజర్వేషన్ రూల్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా:

జిల్లా స్త్రీ శిశు సంక్షేమం మరియు సాధికారత అధికారి,
చాకిరాల మిట్ట, బరంపేట్,
నరసరావుపేట, పల్నాడు జిల్లా-522601.

Flash...   COVID : కోవిడ్‌ ఎప్పుడు అంతమవుతుందో తెలుసా? మరి ఇవి తెలుసుకోండి

ముఖ్యమైన తేదీలు

  • ➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 18.11.2023.
  • ➥ ఆఫ్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28.11.2023.