రాష్ట్ర ప్రభుత్వం రామగిరిలో నెలకొల్పిన స్కిల్ కాలేజీలో నిరుద్యోగ యువతకు ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణతోపాటు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు స్కిల్ కళాశాల మేనేజర్ నాగేంద్రబాబు ఒక ప్రకటనలో తెలిపారు.
ఏదైనా డిగ్రీ, బీటెక్, డిప్లొమా చదివిన నిరుద్యోగులు ఈ నెల 8 నుంచి 13వ తేదీ వరకు ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 5జీ నెట్‌వర్క్, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, ఎంఎస్ ఆఫీస్, ట్యాలీ, కంప్యూటర్ హార్డ్‌వేర్ తదితర కోర్సులను 6 నెలల పాటు ఉచితంగా అందించనున్నట్లు పేర్కొన్నారు.
శిక్షణ సమయంలో ఉచిత భోజన, వసతి సౌకర్యాలు కూడా కల్పిస్తారు. 6 నెలల శిక్షణ అనంతరం సర్టిఫికెట్ తో పాటు పలు ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ఉచిత శిక్షణను ఆసక్తి గల యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 7386143423ను సంప్రదించవచ్చు.