Google: కారు ప్రమాదాలను వెంటనే గుర్తించే టెక్నాలజీ.. గూగుల్‌ సూపర్ ఫీచర్‌

Google: కారు ప్రమాదాలను వెంటనే గుర్తించే టెక్నాలజీ.. గూగుల్‌  సూపర్ ఫీచర్‌

ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రహదారులు గొప్పగా ఉన్నప్పటికీ, అధునాతన ఫీచర్లతో వాహనాలు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, ప్రమాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే టెక్నాలజీతో ఈ ప్రమాదాలకు చెక్ పెట్టే ప్రయత్నం జరుగుతోంది. ఇందులో భాగంగానే ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్ తాజాగా సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. విశేషం ఏమిటి? దాని ఉపయోగం ఏమిటి? ఇప్పుడు చూద్దాం

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ కారు ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. గూగుల్ కంపెనీకి చెందిన పిక్సెల్ ఫోన్‌లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ తీసుకురాబడింది. ఈ ఫీచర్ సహాయంతో కారు ప్రమాదాలను నివారించవచ్చు.

భారత్‌తో పాటు ఐదు దేశాల్లో ఈ ఫీచర్‌ను గూగుల్ అందుబాటులోకి తెచ్చింది. పిక్సెల్ ఫోన్‌లో తీసుకొచ్చిన కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్ సహాయంతో ప్రమాదాలకు చెక్ పెట్టవచ్చని ఆండ్రాయిడ్ నిపుణుడు మిషాల్ రెహ్మాన్ తెలిపారు.

కారు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు, అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ అలర్ట్ 112 హెల్ప్‌లైన్ నంబర్ ఆటోమేటిక్‌గా కాల్ చేయబడుతుంది. అంతే వెంటనే.. లొకేషన్ కూడా షేర్ అవుతుంది. మీరు ప్రమాదంలో ఉన్నారని ఇతరులకు తెలియజేస్తుంది.

ప్రస్తుతం, గూగుల్ ఈ ఫీచర్‌ను భారతదేశం, ఆస్ట్రియా, బెల్జియం, పోర్చుగల్, స్విట్జర్లాండ్‌లో విడుదల చేసింది మరియు ఇప్పటివరకు ఇది ప్రపంచవ్యాప్తంగా 20 కంటే ఎక్కువ దేశాలలో అందుబాటులో ఉంది.

Google Pixel ఫోన్‌లలో వ్యక్తిగత భద్రత యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి, ఆపై యాప్‌లో కార్ క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ని యాక్టివేట్ చేయండి. దీని కోసం మీరు లొకేషన్, మైక్రోఫోన్, ఫిజికల్ యాక్టివిటీ పర్మిషన్ వంటి ఆప్షన్‌లకు యాక్సెస్ ఇవ్వాలి.

Flash...   NPS: ఈ విధంగా చేస్తే నెలకి రూ.50 వేలు పెన్షన్..!