Voter ID Card: క్షణాల్లో.. ఓటరు ఐడీ కార్డ్‌.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Voter ID Card: క్షణాల్లో.. ఓటరు ఐడీ కార్డ్‌.. ఇలా డౌన్లోడ్ చేసుకోండి

ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న కొత్త ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డు పొందడంలో జాప్యం జరుగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం కల్పించిన సరికొత్త సదుపాయంతో క్షణాల్లో ఇంటి నుంచే ఓటరు గుర్తింపు కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇప్పుడు చూద్దాం..

ఆన్‌లైన్‌లో పొందండి..

  • ముందుగా, voterrecgov.in లో NVSP పోర్టల్‌కి లాగిన్ చేయండి.
  • ఆపై హోమ్‌పేజీలో ఇ-ఎపిక్ డౌన్‌లోడ్ ఎంపికను ఎంచుకోండి.
  • తర్వాత స్క్రీన్‌పై అడిగిన విధంగా మీ మొబైల్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీ లేదా ఎపిక్ నంబర్‌ను నమోదు చేసి సబ్‌మిట్ బటన్‌ను నొక్కండి.
  • తర్వాత రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేస్తే ఓటీపీ మీ ఫోన్‌కి పంపబడుతుంది.
  • ఇచ్చిన పెట్టెలో నమోదు చేయాలి.
  • చివరగా, డిజిటల్ ఓటరు ID కార్డును డౌన్‌లోడ్ చేయడానికి ఈ-ఎపిక్ ఎంపికపై క్లిక్ చేయండి.
  • ఓటర్ ఐడీ పీడీఎఫ్ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేయబడుతుంది.

ఫిజికల్ కార్డు కావాలనుకునే వారు సమీపంలోని మై సేవ లేదా ఇంటర్నెట్‌కు వెళ్లి ఓటర్ ఐడీ కార్డు ప్రింట్ తీసుకోవచ్చు.

Downloading Voter ID card is now Easy: 

ఈ ప్రక్రియతో ఎన్నికల సంఘం పంపిన ఓటర్ ఐడీ కార్డు కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన పనిలేదు. గతంలో ఈ సదుపాయం ఉన్నప్పటికీ, ఆమోదం పొందడానికి చాలా సమయం పట్టింది. నమోదైన వివరాలను సంబంధిత అసెంబ్లీ ఎన్నికల అధికారి ఆమోదించిన తర్వాతే ప్రక్రియ పూర్తవుతుంది.

Flash...   న‌వంబ‌ర్ 2న స్కూళ్ల పునఃప్రారంభం