నెలకి రు. 1,46,000 జీతం తో డిగ్రీ అర్హత తో 995 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు .. వివరాలు ఇవే..

నెలకి రు. 1,46,000 జీతం తో డిగ్రీ అర్హత తో 995 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు .. వివరాలు ఇవే..

IB ACIO రిక్రూట్‌మెంట్ 2023 :

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (ACIO) గ్రేడ్-II ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి తాజా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 995 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.mha.gov.in/లో IB ACIO నోటిఫికేషన్ 2023ని తనిఖీ చేయవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 25 నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తులకు డిసెంబర్ 15 చివరి తేదీ. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు : 995

పోస్ట్ పేరు: అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్

అర్హత: గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎలా దరఖాస్తు చేయాలి: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.550, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.450.

ఎంపిక ప్రక్రియ: వ్రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వేతనం: ఈ పోస్టులకు ఎంపికైన వారికి రూ.44,900 నుంచి రూ.1,42,400 ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

  • నోటిఫికేషన్ విడుదల: నవంబర్ 21, 2023
  • దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: నవంబర్ 25, 2023
  • దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబర్ 15, 2023

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: https://www.mha.gov.in/

Flash...   TET, DSC, TRANSFERS భర్తీ