Jio Phone Prima 4G: జియో 4G ఫోన్‌ విడుదల.. ధర, ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..!

Jio Phone Prima 4G: జియో 4G ఫోన్‌ విడుదల.. ధర, ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే..!

ప్రముఖ దిగ్గజం రిలయన్స్ తన జియో ఫోన్ ప్రైమ్ 4జీని విడుదల చేసింది. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2023లో ఈ ఫోన్‌ను ఆవిష్కరించారు. మరి.. ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. రూ. 2,599 ఉంది. దీపావళి నాటికి ఈ ఫోన్ విక్రయానికి అందుబాటులోకి రానుంది. Jio Phone Prima 4G ఫోన్ వివరాలను తెలుసుకుందాం.

Specifications

జియో ఫోన్ 320×240 పిక్సెల్ రిజల్యూషన్, 0.3MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో 2.4 అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ చూడవచ్చు. అంతేకాకుండా.. జియో సినిమా, జియో సావన్, జియో టీవీ, జియో, యూపీఏ చెల్లింపులు చేయవచ్చు. ఈ ఫోన్‌లో బ్లూటూత్ 5.0 కనెక్టివిటీ మరియు FM రేడియో ఉన్నాయి.

Features

జియో ఫోన్ ARM Cortex A53 చిప్‌సెట్‌పై నడుస్తుంది. ఇది 512MB RAM, 128GB వరకు విస్తరించదగిన నిల్వ సామర్థ్యాన్ని కలిగి ఉంది. Jio Prima 4G ఫోన్ KaiOSలో రన్ అవుతుంది. అంతేకాదు.. ఇందులో 1800mAh పవర్ ఫుల్ బ్యాటరీ ఉంది.

Flash...   Learn A Word A Day (22 days) in all schools -July list of words