నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, నోయిడా దేశవ్యాప్తంగా వివిధ యూనిట్లు మరియు కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దీని ద్వారా మొత్తం 74 ఖాళీలను భర్తీ చేస్తారు. విద్యార్హతలు పోస్టుల వారీగా నిర్ణయించబడతాయి. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.700 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు మరియు ESM అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
వివరాలు..
మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు
ఖాళీల సంఖ్య: 74
పోస్టుల కేటాయింపు:
- జనరల్(UR)-34,
- C-11,
- ST-06,
- OBC(NCL)-16,
- EWS-07.
మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 60 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో రెండేళ్ల ఎంబీఏ/పీజీడీబీఎం/పీజీడీఎం(మార్కెటింగ్)/అగ్రి బిజినెస్ మార్కెటింగ్/రూరల్ మేనేజ్‌మెంట్/ఫారిన్ ట్రేడ్/ఇంటర్నేషనల్ మార్కెటింగ్. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. (లేదా) ఎమ్మెస్సీ (అగ్రికల్చర్- సీడ్ సైన్స్ & టెక్నాలజీ/ జెనెటిక్స్ & ప్లాంట్ బ్రీడింగ్/ అగ్రోనమీ/ సాయిల్ సైన్స్/ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ/ ఎంటమాలజీ/ పాథాలజీ)తోపాటు 60 శాతం మార్కులతో బీఎస్సీ (అగ్రికల్చర్) ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
వయోపరిమితి: 31.10.2023 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
మేనేజ్‌మెంట్ ట్రైనీ (F&A): 10 పోస్టులు
అర్హత: డిగ్రీతోపాటు CA/ICWA/CMA అర్హత.
వయోపరిమితి: 31.10.2023 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
మేనేజ్‌మెంట్ ట్రైనీ (లా): 04 పోస్టులు
అర్హత: 60 శాతం మార్కులతో మూడేళ్లు/ఐదేళ్లు ఫుల్‌టైమ్ లా డిగ్రీ (LLB/BL). ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 50 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
వయోపరిమితి: 31.10.2023 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు రుసుము: రూ.700. SC, ST, దివ్యాంగులు మరియు ESM అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. క్రెడిట్ కార్డ్ / డెబిట్ కార్డ్ / నెట్ బ్యాంకింగ్ / UPI చెల్లింపుల ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
రాత పరీక్ష విధానం..
మొత్తం 100 మార్కులకు ఓఎంఆర్ విధానంలో రాత పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం ప్రశ్నలలో 100 మార్కులు అభ్యర్థి సంబంధిత సబ్జెక్టుల నుండి మరియు 50 ప్రశ్నలు జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ & జనరల్ నాలెడ్జ్ నుండి అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. పరీక్ష హిందీ మరియు ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. పరీక్షలో నెగెటివ్ మార్కులు లేవు. వ్రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1 : 5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి ఎంపిక చేస్తారు. అంటే ఒక్కో పోస్టుకు 5 ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.
పరీక్షా కేంద్రాలు:
రాంచీ (ఝుర్ఖండ్), లక్నో (ఉత్తరప్రదేశ్), చండీగఢ్ (చండీగఢ్), రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), న్యూఢిల్లీ (ఢిల్లీ), బెంగళూరు (కర్ణాటక), భోపాల్ (మధ్యప్రదేశ్), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణ) , చెన్నై (తమిళనాడు), కొచ్చి (కేరళ), జైపూర్ (రాజస్థాన్), ముంబై (మహారాష్ట్ర), గౌహతి (అస్సాం), కోల్‌కతా (పశ్చిమ బెంగాల్).
జీతం: నెలకు రూ.40,000 – రూ.1,40,000.
ముఖ్యమైన తేదీలు
- ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 02.12.2023.
- ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01.12.2023.
దరఖాస్తు పునర్విమర్శ తేదీలు: 03 – 04.12.2023.