భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ – వైరల్ వీడియో!

భవిష్యత్తు వీటిదే అంటున్న నితిన్ గడ్కరీ – వైరల్ వీడియో!

దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు హరిత ఇంధనం లేదా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించాలని గత కొద్ది రోజులుగా కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి ‘నితిన్ గడ్కరీ’ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో తన గ్యారేజీలో ప్రపంచంలోనే తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ కారు గురించి వివరించాడు. దీని గురించి మరిన్ని వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

సాధారణంగా రాజకీయ నాయకులు మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ వంటి ఖరీదైన కార్లను ఉపయోగిస్తారు. కానీ గడ్కరీ మాత్రం ఇథనాల్ పవర్‌తో నడిచే ప్రోటోటైప్ హైబ్రిడ్ కారు ‘ఇన్నోవా హైక్రాస్’ని ఉపయోగిస్తున్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే సదుద్దేశంతో ప్రజలకు చెప్పడమే కాకుండా ఆ పని చేయడం నిజంగా గొప్ప విషయం.

ఈ వీడియోలో తన కారు గురించి వెల్లడిస్తూ, ఇది ప్రపంచంలోనే మొదటి 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనం అని చెప్పాడు. ఇందుకు అవసరమైన ఇంధనాన్ని రైతుల నుంచి పొందుతామని, ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని, పెట్రోలు కంటే తక్కువ ధరకే లభిస్తుందని చెప్పారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్‌తో కూడిన ద్విచక్ర వాహనాలు త్వరలో మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి మరియు దేశవ్యాప్తంగా పెట్రోల్ పంపుల ద్వారా ఇటువంటి ఇంధనాలను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇండియన్ ఆయిల్ ప్రస్తుతం ఇథనాల్ నుంచి ఏవియేషన్ గ్రేడ్ ఇంధనాన్ని వెలికితీసే ప్రక్రియలో ఉందని ఆయన చెప్పారు. ప్రణాళికలన్నీ సక్రమంగా జరిగితే రానున్న రోజుల్లో పెట్రోలియం దిగుమతులు తగ్గుతాయని స్పష్టం చేశారు.

నితిన్ గడ్కరీ యొక్క గ్యారేజీలో హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ పవర్డ్ టయోటా మిరాయ్ కూడా ఉంది. ఇది ఫ్యూచరిస్టిక్ కారు అని, భవిష్యత్తులో ఇలాంటి కార్లు వినియోగంలోకి వస్తాయని వెల్లడించారు. ఈ కారులో 1.2 కిలోవాట్ లిథియం-అయాన్ బ్యాటరీ మరియు మూడు హైడ్రోజన్ ట్యాంకులు ఉన్నాయి. కాబట్టి ఇది 647 కి.మీ పరిధిని అందిస్తుంది.

Flash...   TELUGU 6 - 10 CLASSES LESSON PLANS