ITI అర్హత తో APSRTC నుండి 309 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ ఇదే..

ITI అర్హత తో APSRTC నుండి 309 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. అప్లికేషన్ ఇదే..

APSRTC నోటిఫికేషన్ 2023, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC), నెల్లూరు జోన్ వివిధ ట్రేడ్‌లలో అప్రెంటిస్ శిక్షణ కోసం 309 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులు తమ దరఖాస్తులను నవంబర్ 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చు. అర్హులైన అభ్యర్థులను కర్నూలులోని ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజీలో నిర్వహించే సర్టిఫికెట్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

మొత్తం ఖాళీలు 309

ట్రేడ్స్ డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, పెయింటర్, ఫిట్టర్, మెషినిస్ట్, డ్రాఫ్ట్స్‌మన్ సివిల్

అర్హత:  సంబంధిత ట్రేడ్‌లో ITI  ఉత్తీర్ణులై ఉండాలి

కర్నూలు జోన్ పరిధిలో APSRTC జిల్లాల వారీగా ఖాళీలు

జిల్లా ఖాళీలు

  • కర్నూలు 49
  • నంద్యాల 50
  • అనంతపురం 52
  • శ్రీ సత్యసాయి 40
  • కడప 67
  • అన్నమయ్య 51

APSRTC ఎంపిక ప్రక్రియ

ఎంపిక క్రింది ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది:

విద్యార్హతలలో సాధించిన మార్కులు

ఇంటర్వ్యూ

రిజర్వేషన్ రూల్ మొదలైనవి.

అప్లికేషన్ మరియు ధృవీకరణ వివరాలు

సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118

దరఖాస్తు చిరునామా: ప్రిన్సిపాల్‌, ఆర్టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కాలేజీ, ఏపీఎస్‌ఆర్‌టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలు.

సర్టిఫికెట్ పరిశీలన స్థలం: ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజ్, APSRTC, బళ్లారి చౌరస్తా, కర్నూలు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం:

నవంబర్ 01, 2023

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:

నవంబర్ 15, 2023

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 16, 2023

అధికారిక వెబ్‌సైట్: www.apsrtc.ap.gov.in

Flash...   Terminal Holidays Prefix and Suffix Clarifications