ONGC : ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్‌.. డిగ్రీ, పీజీ, బీటెక్‌, ఎంబీబీఎస్‌ విద్యార్థులు అర్హులు.. అప్లయ్‌ చేసుకోండి

ONGC :  ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్‌.. డిగ్రీ, పీజీ, బీటెక్‌, ఎంబీబీఎస్‌ విద్యార్థులు అర్హులు.. అప్లయ్‌ చేసుకోండి

ONGC : పేద విద్యార్థులకు ఏడాదికి రూ.48,000 స్కాలర్‌షిప్‌.. డిగ్రీ, పీజీ, బీటెక్‌, ఎంబీబీఎస్‌ విద్యార్థులు అర్హులు.. అప్లయ్‌ చేసుకోండి

ONGC స్కాలర్‌షిప్ 2023: చదువుకోవాలనే కోరిక ఉన్న, కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ONGC స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. వివరాల్లోకి వెళితే..

UG PG కోర్సుల కోసం ONGC స్కాలర్‌షిప్ 2023-24: భారతదేశంలో చదువుతున్న ఆర్థికంగా వెనుకబడిన జనరల్, OBC, SC, ST విద్యార్థులకు శుభవార్త. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC) లిమిటెడ్ ఫౌండేషన్ 2023-24 విద్యా సంవత్సరానికి స్కాలర్‌షిప్ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఎంబీబీఎస్, ఎంబీఏ, పీజీ (జియాలజీ/జియోఫిజిక్స్) కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులకు స్కాలర్‌షిప్ అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. మొత్తం రెండు వేల స్కాలర్‌షిప్‌లు కేటాయించారు. జనరల్‌కు 500, ఓబీసీలకు 500, ఎస్సీ/ఎస్టీలకు 1000 కేటాయించారు. అర్హులైన జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు స్టైఫండ్ ఇస్తారు. ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన వారికి కోర్సు పూర్తయ్యే వరకు సంవత్సరానికి 48,000 అందించబడుతుంది.

UG PG కోర్సుల కోసం ONGC స్కాలర్‌షిప్ 2023-24

అర్హత: ఏదైనా విద్యా సంస్థలో రెగ్యులర్ మోడ్‌లో పూర్తి సమయం కోర్సును అభ్యసిస్తూ ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలో ఇంజినీరింగ్ (BE/B.Tech), పీజీ స్థాయిలో MBBS లేదా జియాలజీ/ జియోఫిజిక్స్/ MBAలో ఏదైనా కోర్సును అభ్యసిస్తున్న ఫ్రెషర్ విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇంజినీరింగ్‌, ఎంబీబీఎస్‌ చదువుతున్న విద్యార్థులు ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. M.C చదువుతున్న విద్యార్థులు జియాలజీ/జియోఫిజిక్స్ లేదా ఎంబీఏ కోర్సులకు డిగ్రీలో 60% మార్కులు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలకు మించకూడదు.
వయస్సు: అభ్యర్థుల వయస్సు 16-10-2023 నాటికి 30 ఏళ్లు పైబడి ఉండాలి.

అభ్యర్థుల ఎంపిక: అభ్యర్థి చేరిన కోర్సు ఆధారంగా ఇంటర్ లేదా డిగ్రీలో సాధించిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

Flash...   SBI స్వాతంత్య్ర దినోత్సవ కానుక: కొత్త స్కీం

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ONGC వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేయాలి. అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయాలి. అంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 30, 2023.

పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్‌ని సందర్శించండి: https://ongcscholar.org/