లోన్: మనకు అత్యవసరంగా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైతే… బ్యాంకు పర్సనల్ లోన్ కోసం చూస్తాం. దీన్ని EMIల కింద చెల్లించవచ్చు. కానీ కొన్నిసార్లు వ్యక్తిగత రుణం పొందడం కష్టం. ఇలాంటి పరిస్థితుల్లో పాన్ కార్డ్.. ఈ పనిని సులభతరం చేస్తుంది. మీరు పాన్ కార్డ్ సహాయంతో కూడా లోన్ పొందవచ్చు. ఈ వివరాలను చూద్దాం.
PAN Card – Personal Loan:
అత్యవసర ఆర్థిక అవసరాలు మరియు ఊహించని ఖర్చులను తీర్చుకోవడానికి మనం కలిగి ఉన్న కొన్ని మార్గాలలో వ్యక్తిగత రుణం ఒకటి. డబ్బు అత్యవసర పరిస్థితుల్లో.. వ్యక్తిగత రుణాలపైనే ఎక్కువగా ఆధారపడతారు. మీ వద్ద ఎలాంటి పూచీకత్తు లేకపోయినా, మీరు సులభంగా వ్యక్తిగత రుణాన్ని పొందవచ్చు. కానీ.. ఒక్కోసారి పర్సనల్ లోన్ తీసుకోవాలంటే కష్టపడాల్సి వస్తుంది. అయితే పాన్ కార్డుతో రుణం పొందవచ్చని మీకు తెలుసా?
ఈ రోజుల్లో భారతీయ పౌరులకు పాన్ కార్డ్ అత్యంత ముఖ్యమైన పత్రం అనే విషయం తెలిసిందే. ఆర్థిక లావాదేవీలు నిర్వహించే ప్రతి ఒక్కరికీ పాన్ కార్డ్ అవసరం. కొన్ని లావాదేవీలకు ఈ పాస్‌వర్డ్ పాన్ నంబర్ తప్పనిసరి. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్ చేసే వారికి.. స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేయడానికి.. డీమ్యాట్ ఖాతాకు కూడా పాన్ కార్డు తప్పనిసరి. ఇది ఆర్థిక లావాదేవీలను ట్రాక్ చేయడానికి, పన్ను సంబంధిత లావాదేవీలను గుర్తించడానికి మరియు గుర్తింపు రుజువుగా కూడా ఉపయోగపడుతుంది. బ్యాంక్ అకౌంట్ కావాలన్నా.. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలన్నా.. జీతం తీసుకోవాలన్నా.. పాన్ కార్డు తప్పనిసరి. పాన్ కార్డుతో రూ. 50 వేల వరకు రుణం పొందవచ్చు. ఇప్పుడు చాలా బ్యాంకులు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి.
పాన్ కార్డు సాయంతో రుణం పొందాలంటే.. కొన్ని డాక్యుమెంట్లు సమర్పించాలి.
- కనీసం రెండేళ్ల పని అనుభవం ఉండాలి.
- మీరు కంపెనీలో పనిచేసినా లేదా మీ స్వంత వ్యాపారం కలిగినా, మీ క్రెడిట్ స్కోర్ మెరుగ్గా ఉండాలి.
- మీకు మంచి క్రెడిట్ స్కోర్ ఉంటేనే మీరు లోన్‌కు అర్హులు.
Cibil score..
బ్యాంకులు లేదా NBFCలు పాన్ కార్డ్ వివరాల సహాయంతో మీ CIBIL స్కోర్‌ని తనిఖీ చేస్తాయి. CIBIL స్కోర్ మీ గత లావాదేవీల వివరాలను బ్యాంక్ లేదా NBFCకి అందిస్తుంది. మంచి క్రెడిట్ హిస్టరీ రికార్డ్ కలిగి ఉండటం వల్ల మీ CIBIL స్కోర్ మెరుగుపడుతుంది.
మీ సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉంటే.. పాన్ కార్డు సాయంతో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాంకులు.. రూ. 50 వేల వరకు రుణం అందజేస్తారు. పూర్తి వివరాలతో బ్యాంకును సంప్రదించి రుణం పొందవచ్చు