Public Holidays 2024: వచ్చే ఏడాదిలో గవర్నమెంట్ హాలిడేస్ ఇవే.. ఆ నెలలోనే ఎక్కువ..
ప్రతి నెలలో అనేక ప్రభుత్వ సెలవులు.. అలాగే వచ్చే ఏడాది సెలవుల జాబితాను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది.. జనవరి, ఏప్రిల్, అక్టోబర్‌లలో అత్యధిక సెలవులు ఉన్నాయి.
జనవరిలో ఐదు సెలవులు ఉంటే, ఏప్రిల్ మరియు అక్టోబర్ నెలల్లో ఐదు మరియు ఆరు సెలవులు ఉన్నాయి. మరోవైపు ఫిబ్రవరి, మే, నవంబర్‌లలో సాధారణ సెలవులు ఉండవు. 2024 సంవత్సరంలో 25 సాధారణ సెలవులు ఉన్నాయి. ఈ జాబితా ప్రకారం, వచ్చే ఏడాదిలో ఏ నెలలో ఎన్ని రోజులు సెలవులు ఉంటాయో తెలుసుకుందాం.
ఇవి 2024లో సాధారణ సెలవులు.
- జనవరి 1 (సోమవారం) – నూతన సంవత్సరం రోజు
- జనవరి 14 (ఆదివారం) – బోగి
- జనవరి 15 (సోమవారం) – సంక్రాంతి
- జనవరి 16 (మంగళవారం) – కనుమ
- జనవరి 26 (శుక్రవారం) – గణతంత్ర దినోత్సవం
- మార్చి 8 (శుక్రవారం) – మహాశివరాత్రి
- మార్చి 29 (శుక్రవారం) – గుడ్ ఫ్రైడే
- ఏప్రిల్ 5 (శుక్రవారం) – బాబు జగ్జీవన్ రామ్ జయంతి
- ఏప్రిల్ 9 (మంగళవారం) – ఉగాది
- ఏప్రిల్ 10 (బుధవారం) – రంజాన్
- ఏప్రిల్ 14 (ఆదివారం) – బి.ఆర్. అంబేద్కర్ జయంతి
- ఏప్రిల్ 17 (బుధవారం) – శ్రీరామనవమి
- జూన్ 17 (సోమవారం) – బక్రీద్
- జూలై 17 (బుధవారం) – ముహర్రం
- ఆగస్ట్ 15 (గురువారం) – స్వాతంత్ర్య దినోత్సవం
- ఆగస్ట్ 26 (సోమవారం) – శ్రీ కృష్ణ అష్టమి
- సెప్టెంబర్ 7 (శనివారం) – వినాయకచవితి
- సెప్టెంబర్ 16 (సోమవారం) – ఈద్ మిలాదున్ నబీ
- అక్టోబర్ 2 (బుధవారం) – మహాత్మా గాంధీ జయంతి
- అక్టోబర్ 11 (శుక్రవారం) – దుర్గాష్టమి
- అక్టోబర్ 12 (శనివారం) – మహర్ నవమి
- అక్టోబర్ 13 (ఆదివారం) – విజయదశమి
- అక్టోబర్ 30 (బుధవారం)- నరకచతుర్దశి
- అక్టోబర్ 31 (గురువారం) – దీపావళి
- డిసెంబర్ 25 (బుధవారం) – క్రిస్మస్
- ఈ రోజుల్లో బ్యాంకులు పని చేయడం లేదు.