ఉపాధ్యాయులే కీలకం.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధులకు టీచర్ల వివరాలు సేకరణ.

ఉపాధ్యాయులే కీలకం..   ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విధులకు  టీచర్ల వివరాలు సేకరణ.

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యొక్క నగారా మ్రోగనుంది . త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబంధించి ఎన్నికల విధులు కోసం కలెక్టర్లకు అన్ని రకాల ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క వివరాలు పంపాలనేటువంటి ఆదేశాలు వెళ్లి ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఎన్నికల విధులకు పై కసరత్తు ప్రారంభించారు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలలో శాఖావారీగా అన్ని కేడర్ ఉద్యోగుల యొక్క వివరాలు పంపాలని ప్రతి జిల్లా కలెక్టర్కు ఎన్నికల అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు గా తెలుస్తోంది

టీచర్లకు బోధన తప్ప బోధ నేత్ర పనులు ఏవి కూడా అప్పజెప్పరాదు అనేటువంటి ఒక జీవో కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గతంలో ఇచ్చి ఉన్నది. తప్పనిసరి పరిస్థితిలో తప్ప ఉపాధ్యాయులను వేరే పనులకు వాడకూడదు అనేటువంటి అంశంతో ఆ జీవోని విడుదల చేశారు. కానీ ప్రస్తుతం ఉపాధ్యాయుల పాత్ర ఎన్నికల విధుల్లో కీలకం కానుంది కాబట్టి ఉపాధ్యాయులు లేకుండా ఎన్నికలు వినిపించడం చాలా కష్టమైన భావిస్తూ ఉపాధ్యాయుల యొక్క వివరాలు కూడా DDO ల దగ్గర నుంచి తీసుకోవాలని ఉద్దేశంతో కలెక్టర్లకు తగు సూచనలు అందాయి అని తెలుస్తుంది .

ఏది ఏమైనప్పటికి కూడా రాబోవు ఎన్నికలలో ఉపాధ్యాయుల యొక్క పాత్ర చాలా కీలకంగా మారుతుంది వీరు లేకుండా ఎలక్షన్ విధులు పూర్తిచేయటం కూడా అతి సులువేని కాదు ఈ ఉద్దేశంతోనే జరగబోవు అసెంబ్లీ ఎన్నికలకు టీచర్ల యొక్క అవసరం ఎంతైనా ఉందని భావించిన ఎలక్షన్ కమిషన్ సంబంధిత కలెక్టర్ల నుంచి ఉద్యోగులకు వివరాలను నిర్దిష్ట ప్రొఫార్మా లో ఇవ్వాల్సిందిగా కోరిన్నారని తెలుస్తుంది

Flash...   Elections 2024: ఈసారి ఎలక్షన్ డ్యూటీ చేసేవారికి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?