జిల్లాలో తొలి మొబైల్‌ పాల ఏటీఎం ప్రారంభం

జిల్లాలో తొలి మొబైల్‌ పాల ఏటీఎం ప్రారంభం

మిల్క్ మెషిన్ వద్ద శ్రీనివాస్ నవరంగపూర్ : నవరంగపూర్ జిల్లాలో తొలిసారిగా 24 గంటలపాటు సంచర పాల ATM (ANY TIME MILK) అందుబాటులోకి వచ్చింది.

ఆగ్రో ఫామ్ యాజమాన్యం ఏర్పాటు చేసిన ఈ ఏటీఎంలో పాలు కొనుగోలు చేసే వినియోగదారులకు స్మార్ట్ కార్డులు ఇస్తారు. నందహంది సమితిని కేసరిగూడ గ్రామానికి చెందిన సత్యబాన్ సాహు, శ్రీనివాస్ రావు ప్రారంభించారు. వినియోగదారులు కార్డు తీసుకుని ఇంటి వద్దకే వెళ్లి పాలను పంపిణీ చేస్తున్నారు. రోజుకు 90-110 లీటర్లు విక్రయిస్తున్నట్లు శ్రీనివాస్‌ తెలిపారు. ఆవుల ద్వారా 130 లీటర్లు ఉత్పత్తి అవుతుండగా, 20-30 లీటర్లు పెరుగు, జున్ను, వెన్న తయారు చేస్తున్నట్లు వెల్లడించారు. స్వచ్ఛమైన పాలు తమ ఇంటి వద్దకే చేరుతుండటంతో వినియోగదారులు సైతం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Flash...   30 నిమిషాల్లో రూ.50 లక్షల వరకు లోన్ ని ఇలా ఈజీగా పొందండి…!