ప్రధానోపాధ్యాయినికి పంచాయతీ కార్యదర్శి తాఖీదు జారీ.. ఎక్కడో తెలుసా..

ప్రధానోపాధ్యాయినికి పంచాయతీ కార్యదర్శి తాఖీదు జారీ.. ఎక్కడో తెలుసా..

సంతమాగులూరు : మరియమ్మ అనే ప్రధానోపాధ్యాయురాలు ఈ నెల 6న పంచాయతీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశానికి రాకపోవడంతో పంచాయతీ కార్యదర్శి ఎం.పూర్ణచంద్రరావు 8న సంజ యిషీ నోటీసు పంపారు. ఈ విషయంపై దుమారం రేగింది. సర్పంచి జిర్ర విజయబాబు ఆదేశాల మేరకు నోటీసు పంపినట్లు పంచాయతీ కార్యదర్శి పేర్కొన్నారు. దీనిపై పంచాయతీ కార్యదర్శిని ప్రశ్నించగా.. పంచాయతీలోని అన్ని ప్రభుత్వ శాఖలపై గ్రామపంచాయతీ చట్టబద్ధమైన అధికారంతో సర్పంచి జిర్రా విజయబాబు ఆదేశాల మేరకు ప్రధానోపాధ్యాయురాలు మరియమ్మకు తాఖీదు పంపినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సర్పంచి మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శికి తాఖీదు జారీ చేయాలని ఆదేశాలు ఇవ్వలేదన్నారు. దీనిపై ఎంఈవో వి.కోటేశ్వరరావు మాట్లాడుతూ చట్ట ప్రకారం ప్రభుత్వ ఉపాధ్యాయుడిని మందలించే అధికారం పంచాయతీ కార్యదర్శికి లేదన్నారు. సాధారణంగా డీఈవోకు మాత్రమే ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చే ఉండగా ఉండగా పంచాయతీ కార్యదర్శిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

Flash...   Certain instructions regarding highschool time table