అమరావతి: ఈ విద్యా సంవత్సరం (2023-24) ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జనరల్, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు షెడ్యూల్‌ను ఇంటర్మీడియట్ విద్యా మండలి మంగళవారం విడుదల చేసింది.
వచ్చే మార్చిలో నిర్వహించే బోర్డు పరీక్షలకు హాజరు కావడానికి విద్యార్థులు నిర్ణీత గడువులోగా తమ కళాశాలల్లో ఫీజు చెల్లించాలని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరభ్ గౌర్ మంగళవారం తెలిపారు.
రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులు ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 30 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో డిసెంబర్ 15 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.
♦ ప్రథమ/ద్వితీయ సంవత్సరం థియరీ పరీక్షలకు రూ.550, ద్వితీయ సంవత్సరం జనరల్, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ ప్రాక్టికల్స్‌కు రూ.250, బ్రిడ్జి కోర్సులకు రూ.150.
♦ ఇంటర్మీడియట్ రెండేళ్ల థియరీ పరీక్షలకు రూ.1,100, ఒకేషనల్ రెండేళ్ల ప్రాక్టికల్స్‌కు రూ.500, ఒకేషనల్ బ్రిడ్జ్ కోర్సుకు రూ.300.
♦ ఇప్పటికే ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన వారు రెండేళ్లపాటు ఆర్ట్స్ విద్యార్థులకు రూ.1,240, సైన్స్ విద్యార్థులకు రూ.1,440 చెల్లించాలి.