MEO లు పాఠశాల విజిట్ సందర్భం లో చూసే అంశాలు ఇవే.. ఇవి అన్ని ఉంటె చాలు సేఫ్ గా ఉండొచ్చు..

MEO లు పాఠశాల విజిట్ సందర్భం లో చూసే అంశాలు ఇవే.. ఇవి అన్ని ఉంటె చాలు సేఫ్ గా ఉండొచ్చు..

గౌరవ పాఠశాల ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ గారు మొన్న తన వీడియో కాన్ఫరెన్స్ లో ప్రతి ఎంఈఓ కూడా ఈ వారం పాటు అన్ని పాఠశాలలు తప్పనిసరిగా వెళ్లి ప్రతి ఒక్క టీచర్ యొక్క అన్నిఅకాడమిక్ ప్రోగ్రెస్ ,వర్క్ బుక్స్ , సిలబస్ పూర్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని ఆవిధం గా చేసి రిపోర్ట్ లు తనకి పంపాలని ఆదేశించి ఉన్నారు . లేనిపక్షంలో ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ విధంగా రాష్ట్రంలో అందరి మండల విద్యాశాఖ అధికారులను డిప్యూటీ విద్యాశాఖ అధికారులను ఆదేశించి ఉన్నారు ఈ మధ్యకాలంలో వారి వెళ్లిన నెల్లూరు జిల్లాలో మరియు గుంటూరు జిల్లాలలో వర్క్ బుక్స్ కరెక్షన్ సరిగా చేయలేదనే కారణం చేత కొంతమంది ఉపాధ్యాయులని సస్పెండ్ చేయటము మరియు వారిపై చార్జెస్ ప్రేమ్ చేయటం వంటివి జరగటం మనం చూసే ఉన్నాము.

కాబట్టి ఈ నేపథ్యంలో మండల విద్యాశాఖ అధికారులు పాఠశాలకు వచ్చిన సమయంలో వారు ఏ అంశాన్ని పరిశీలిస్తున్నారు ఏ అంశాలలో మన దగ్గర వారు గమనిస్తారు అనే దాని గురించి ఒక విజిట్ ప్రొఫార్మాని రోపొందించారు . ఈ విజిట్ ప్రొఫార్మాలో ఏ అంశాలు అయితే ఉన్నాయో  అందరూ ఈ యొక్క ప్రొఫార్మ్ అని ఒకసారి చూసుకుని ఎక్కడైతే వారు ఇంకా  వెనుకబడి ఉన్నారో వాటిని త్వరగా పూర్తి చేసుకొని ముందుగానే రెడీ గా ఉంటారని .. ఈ విసిట్ ప్రొఫార్మా ని ఇస్తున్నాం

Flash...   New Admissions online Process in AP Govt Schools