భారీ వేతనంతో SBI లో 5వేలకు పైగా పోస్టులు.. త్వరగా అప్లై చేసుకోండి!

భారీ వేతనంతో SBI లో 5వేలకు పైగా పోస్టులు.. త్వరగా అప్లై చేసుకోండి!

SBIలో 5000 కంటే ఎక్కువ CBO ఉద్యోగాల కోసం దరఖాస్తు గడువు చివరి దశకు చేరుకుంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బీఐలో ఉద్యోగాల కోసం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. SBIలోని వివిధ సర్కిళ్లలో మొత్తం 5,447 (167 బ్యాక్‌లాగ్ ఖాళీలు) సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల కోసం దరఖాస్తులకు చివరి తేదీ సమీపిస్తోంది.
వాస్తవానికి దరఖాస్తు గడువు డిసెంబర్ 12తో ముగియగా, దానిని డిసెంబర్ 17 వరకు పొడిగించారు.ఈ మొత్తం ఉద్యోగాల్లో తెలుగు రాష్ట్రాల్లో 800కు పైగా ఖాళీలు ఉన్నాయి. RBI జాబితా చేసిన ఏదైనా బ్యాంకులో గరిష్టంగా రెండేళ్లపాటు పనిచేసిన వారు అర్హులు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ పోస్టులకు https://www.sbi.co.in/web/careers#lattest డిసెంబర్ 17లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లోని కొన్ని ముఖ్యాంశాలు..

విద్యార్హత:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత. బ్యాంకింగ్ రంగంలో రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.

వయోపరిమితి:
మార్చి 31, 2023 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీతం:
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి ₹36,000-₹63,840 మధ్య చెల్లించబడుతుంది.

ఎంపిక ప్రక్రియ:
ఈ పోస్టులకు ఎంపిక ఆన్‌లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు రుసుము:
రూ.750 (SC, ST, వికలాంగులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు)
వచ్చే ఏడాది జనవరిలో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్

Download Notification pldf here

Flash...   Amma Vodi : Portal issues