APPSC: గ్రూప్-1 నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం 81 పోస్టులు ఇవే….

APPSC: గ్రూప్-1 నోటిఫికేషన్‌ విడుదల.. మొత్తం 81 పోస్టులు ఇవే….

APPSC గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల

APPSC గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 81 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనున్నట్లు APPSC వెల్లడించింది. వచ్చే ఏడాది January 1 నుంచి 21 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడతాయి. ప్రిలిమినరీ పరీక్ష మార్చి 17న జరగనుంది.ఈ పరీక్ష ఆఫ్‌లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. డిస్క్రిప్టివ్ మోడ్‌లో నిర్వహించే మెయిన్స్ పరీక్ష తేదీ ఇంకా ఖరారు కాలేదు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిన్న 897 గ్రూప్-2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది.

పోస్టుల వివరాలు

  • AP సివిల్ సర్వీస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9;
  • పన్నుల అసిస్టెంట్ కమిషనర్ 18;
  • డీఎస్పీ (సివిల్) 26;
  • ప్రాంతీయ రవాణా అధికారి 6;
  • సహకార సేవలలో డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5;
  • జిల్లా ఉపాధి అధికారి 4;
  • జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3;
  • అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్/అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు 3;
  • అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2;
  • జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ 1,
  • జిల్లా బీసీ సంక్షేమ అధికారి 1,
  • మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ II – 1,
  • అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 1 .

పరీక్షా విధానం, సిలబస్ తదితర పూర్తి వివరాలను క్రింది PDFలో చూడవచ్చు.

SCREEING TEST - WRITTEN EXAMINATION (OBJECTIVE TYPE)

MAINS - WRITTEN EXAMINATION (DESCRIPTIVE TYPE)

Flash...   Complaint against china veerabadhrudu in Karnool