APPSC GROUP 2: గ్రూప్‌–2 ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ, స్టయిఫండ్‌.. ఎక్కడో తెలుసా ?

APPSC GROUP 2: గ్రూప్‌–2 ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత శిక్షణ, స్టయిఫండ్‌.. ఎక్కడో తెలుసా ?

APPSC  Group-2 రిక్రూట్‌మెంట్ ప్రిలిమినరీ పరీక్షకు ఉమ్మడి జిల్లాలోని పేద అభ్యర్థులకు డిసెంబర్ 17(ఆదివారం)న ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ తిరుపతి జిల్లా అధికారి బి.భాస్కర్ రెడ్డి తెలిపారు.

SC, ST, BC అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని..

27 నుంచి 50 రోజుల పాటు ఉచిత శిక్షణతోపాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్అం దజేయడం జరుగుతుందన్నారు. డిగ్రీలో మార్కుల మెరిట్ జాబితా ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేస్తామని తెలిపారు.

ఎంపికైన వారికి తిరుపతి ఎమ్మార్పల్లె బీసీ స్టడీ సర్కిల్ లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు వివరించారు. దరఖాస్తులను APBC స్టడీ సర్కిల్‌లో BCS, డోర్ నంబర్ 4-171-2, తిరుపతిలో సమర్పించాలని సూచించారు. వివరాలకు 9441456039, 9985022254, 9346221553 నంబర్లలో సంప్రదించాలని కోరారు.

Flash...   Black Raisin: నల్ల ఎండుద్రాక్ష ఆరోగ్యానికి నిధి.. చలికాలంలో రోజూ తింటే