Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు 18 రోజులు సెలవు ఇవే..

Bank Holidays: డిసెంబర్‌లో బ్యాంకులకు 18 రోజులు సెలవు ఇవే..

డిసెంబర్ 2023లో బ్యాంకులకు సెలవులు:

 డిసెంబరు నెలలో, అనేక ఆర్థిక అంశాలలో కొన్ని మార్పులు ఉంటాయి.

దేశంలో బ్యాంకింగ్ సేవలు భారీగా విస్తరించాయి. ప్రభుత్వాలు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల ఖాతాల్లోకే జమ అవుతున్న ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ బ్యాంకు ఖాతా అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో బ్యాంకు పనివేళలు, సెలవులపై అందరి దృష్టి సారిస్తోంది. బ్యాంకులు ఏ రోజుల్లో తెరిచి ఉంటాయో తెలుసుకుని వాటి ఆధారంగా ప్లాన్ చేసుకుంటారు. మరి ఈ క్రమంలో డిసెంబర్ నెలలో బ్యాంకులకు ఏయే రోజులు సెలవులు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

* ఇటానగర్ మరియు కోహిమాలోని బ్యాంకులు డిసెంబర్ 1న పనిచేయవు. దేశీయ విశ్వాస దినోత్సవం సందర్భంగా డిసెంబర్ 1న బ్యాంక్ మూసివేయబడుతుంది.

* డిసెంబర్ 4వ తేదీ పనాజీలో బ్యాంకులకు సెలవు. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ సందర్భంగా బ్యాంకు అక్కడ పనిచేయదు.

* డిసెంబర్ 12 మంగళవారం.. పా-టోగన్ నెంజ్మింగ్ సగామాను పురస్కరించుకుని షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

* నాన్‌సూంగ్‌ను పురస్కరించుకుని డిసెంబర్ 13 మరియు 14 బుధ, గురువారాలను గాంగ్‌టక్‌లోని బ్యాంకులకు సెలవుగా ప్రకటించారు.

* డిసెంబర్ 18 సోమవారం.. సోసో థామ్ వర్ధంతి సందర్భంగా షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

* గోవా విమోచన దినోత్సవాన్ని జరుపుకోవడానికి డిసెంబర్ 19, మంగళవారం, బ్యాంకులు పనాజీలో పనిచేయవు.

* క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీ సోమవారం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు.

* ఇక డిసెంబర్ 26వ తేదీ మంగళవారం.. క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని.. ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

* క్రిస్మస్ వేడుకల్లో భాగంగా డిసెంబర్ 27వ తేదీ బుధవారం కోహిమాలోని బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

* షిల్లాంగ్‌లోని బ్యాంకులకు డిసెంబర్ 30వ తేదీ శనివారం. యో క్యుంగ్ నోంగ్‌బా సందర్భంగా బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

వీటితో పాటు డిసెంబర్ 3వ తేదీ ఆదివారం, డిసెంబర్ 9వ తేదీ రెండో శనివారం, డిసెంబర్ 10వ తేదీ ఆదివారం, డిసెంబర్ 17వ తేదీ ఆదివారం, డిసెంబర్ 23వ తేదీ నాలుగో శనివారం, డిసెంబర్ 24వ తేదీ ఆదివారం. డిసెంబర్ 31 ఆదివారం బ్యాంకులు మూసివేయబడతాయి.

Flash...   Vivo phone best deal: రూ.24 వేల విలువైన 5జీ ఫోన్ కేవలం రూ.15,999కే..కెమెరా కూడా ఎక్సలెంట్

కాగా, బ్యాంకులకు సెలవులు ఉన్నా మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు, ఏటీఎం సేవలు యథావిధిగా పనిచేస్తున్నాయి. ఆన్‌లైన్ సేవల ద్వారా డబ్బును బదిలీ చేయవచ్చు. నగదు విత్‌డ్రాతో పాటు ఏటీఎంల ద్వారా కూడా డిపాజిట్లు చేసుకోవచ్చు.