బంపర్ ఆఫర్ … రూ.7,499 లకే సరికొత్త స్మార్ట్‌ఫోన్..

బంపర్ ఆఫర్ … రూ.7,499 లకే సరికొత్త స్మార్ట్‌ఫోన్..

తక్కువ ధరకు సరికొత్త ఫీచర్లతో కూడిన మంచి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ అయిన Poco, చౌక ధరలో స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తుంది,

Poco C65 పేరుతో భారతదేశంలో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. డిసెంబర్ 18 నుంచి ఈ ఫోన్లు కొనుగోలుదారులకు అందుబాటులోకి రానున్నాయి.

ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో Poco C65 స్మార్ట్‌ఫోన్‌లు విక్రయించబడతాయి. వీటి విక్రయం డిసెంబర్ 18 మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ వేరియంట్‌ను రూ.7,499కి కొనుగోలు చేయవచ్చు. మిగిలిన వేరియంట్లు కూడా రూ. 10,000 దిగువన అందుబాటులో ఉంది. Poco C65 మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. 4GB/128GB వేరియంట్ ధర రూ. 8,499, 6GB/128GB వేరియంట్ రూ. 9,499, 8GB/256GB వేరియంట్ కోసం 8+256GB రూ. 10,999 కంపెనీ ధర నిర్ణయించింది. కానీ ఐసిఐసిఐ డెబిట్/క్రెడిట్ కార్డ్‌లు/ఇఎంఐ లావాదేవీలను ఉపయోగించి ప్రత్యేక విక్రయ రోజున రూ. 1,000 తగ్గింపు మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా ఇవి రూ.7,499 మరియు రూ. 8,499, రూ. 9,999కే సొంతం చేసుకోవచ్చు.

ఈ స్మార్ట్‌ఫోన్‌లు రెండు రంగులలో అందుబాటులో ఉన్నాయి: పాస్టెల్ బ్లూ మరియు మ్యాట్ బ్లాక్. ప్రత్యేక మైక్రో SD కార్డ్ ద్వారా ఈ ఫోన్ మెమరీని 1TB వరకు పెంచుకోవచ్చు.

Poco C65 ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు

  • 6.74 అంగుళాల HD+ 90Hz డిస్‌ప్లే
  • MediaTek Helio G85 ప్రాసెసర్
  • సైడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్
  • 8MP ఫ్రంట్ కెమెరా, 2MP మాక్రో లెన్స్, 50MP AI ట్రిపుల్ రియర్ కెమెరా
  • 18W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5000mAh బ్యాటరీ
  • 10 వాట్ సి-టైప్ ఛార్జర్ సపోర్ట్
Flash...   నేత సిఫారసు.. అనుకున్నచోట DYEO పోస్టింగ్