Covid Alert : మళ్ళీ వేగం గా విస్తరిస్తున్న కరోనా.. రాష్ట్రాలకు హెచ్చరిక ..

Covid Alert : మళ్ళీ వేగం గా విస్తరిస్తున్న  కరోనా.. రాష్ట్రాలకు హెచ్చరిక ..

న్యూఢిల్లీ: దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు, కేరళలో కొత్త వేరియంట్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మన దేశంలో ఇప్పుడు కొత్త వేరియంట్ ఉద్భవించింది, ప్రస్తుతం 38 దేశాలు ఈ JN.1 సబ్ వేరియంట్ కేసులను నివేదిస్తున్నాయని చెప్పారు. అయితే, వచ్చే పండుగ సీజన్‌గా అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. కొత్త వేరియంట్ కేసులను గుర్తించేందుకు ఆర్టీపీసీఆర్ పరీక్షలను పెంచాలని, జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు చేయాలని సూచించింది.

కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాన్ష్ పంత్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు లేఖ రాశారు. వైరస్ వ్యాప్తి తీరును నిశితంగా పరిశీలించాలని, కేసులు ఎక్కువగా నమోదవుతున్న చోట నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కొత్త వేరియంట్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కాగా, కరోనా కేసులతో సహా పెరుగుతున్న శ్వాసకోశ వ్యాధులపై కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ నెల 20న వైద్య అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

రోజురోజుకూ కేసులు పెరుగుతున్నాయి

కొంతకాలంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం నాటికి దేశవ్యాప్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 1,828కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. KERALA లో ఈ నెల 8న కొత్త వేరియంట్ (JN.1) కేసు నమోదైందని.. ఆదివారం ఓ బాధితుడు మృతిచెందాడని వివరించారు. అయితే, ఈ వేరియంట్ కేసులు భారత్‌తో పాటు 38 దేశాల్లో నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సూచనల మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సలహా ఇచ్చింది. వృద్ధులు మరియు బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి.

Flash...   boAt Enigma: బోట్ ఎనిగ్మా స్విచ్ వాచ్ ని విడుదల! ధర, స్పెసిఫికేషన్లు ఇవే ..