దూసుకు వస్తున్న Michaung తుఫాన్ అల్ల కల్లోలం.. తుఫాన్ గమనం చుడండి..

దూసుకు వస్తున్న Michaung  తుఫాన్  అల్ల కల్లోలం..  తుఫాన్ గమనం చుడండి..

ఆంధ్రప్రదేశ్ తమిళనాడు జిల్లాల్లో మిగ్ జాం తుఫాను ప్రస్తుతానికి బీభత్సం సూచిస్తోంది భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఈ రెండు రాష్ట్రాల్లో అలజడి రేగింది చెన్నైలో అయితే తిరుపతిలో అయితే శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అయితే ఇప్పటికి వందల గ్రామాలు నీటిలో చిక్కుకుపోయాయి రహదారులపై నీళ్లు రావడంతో రాకపోవడానికి తీవ్ర ఇబ్బంది కలుగుతున్నాయి. అనేక చెట్లు పడిపోవడం వల్ల విద్యుత్ కూడా నిలిచిపోయింది.

గుంటూరు ప్రకాశం కృష్ణ పశ్చిమగోదావరి జిల్లాలో రాత్రి నుంచి ఈదురు గాలులు అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి గాలులు కూడా తీవ్రం అధికమయ్యాయి దక్షిణం కోస్తా తీరం వెంబడి కొనసాగుతున్న తుఫాను మొత్తం ఎన్ని జిల్లాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. గంటకు సుమారుగా 110 కిలోమీటర్ల వేగంతో సుడిగాలు సృష్టిస్తూ తీరాన్ని చుట్టేస్తుంది ఈ తుఫాను.

సోమవారం ఈ తుఫాను గంటకు 10 కిలోమీటర్ల వేగంతో కోస్తా తీరం వెంబడి కలుగుతుంది ఇదే వేగం ఉంటే మంగళవారం మధ్యాహ్నం చీరాల బాపట్ల మధ్య తీరం దాటుతుందని మన వాతావరణ శాఖ వారు అంచనా వేస్తున్నారు. తీరంలో సోమవారం నుంచి సముద్రం అలలు 1.5 మీటర్ల నుంచి రెండున్నర మీటర్లు ఎంతవరకు ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయి తుఫాన్ నేపథ్యంలో ఎనిమిది జిల్లాల లో దాదాపు 300 పునారావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని భావిస్తూ 180 ఇప్పటికే అందుబాటులో తెచ్చారు అన్రాI రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది 10 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉంచినట్లు కూడా గవర్నమెంట్ తెలుపుతుంది. తీర ప్రాంతాల్లో ఈరోజు నిన్న అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు. అలాగే రేపు కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉంది .

అయితే ప్రస్తుతం ఈ తుఫాను గమనం ఎటువైపుకు వెళుతుంది అసలు ఇది ఎక్కడ కేంద్రీకృతమైంది అనే యొక్క లైవ్ సమాచారాన్ని windy వారి ద్వారా ఈ క్రింది పిక్చర్ మీద నొక్కటం ద్వారా మీరు లైవ్ చూడవచ్చు