Health Tips: బిర్యానీ ఆకుతో షుగర్ కు చెక్, ఎలా వాడాలంటే..!

Health Tips: బిర్యానీ ఆకుతో షుగర్ కు చెక్, ఎలా వాడాలంటే..!

Sugar control with biryani leaf.. know how to use it . We commonly use biryani leaf for making biryani . .

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక సమస్య మధుమేహం. మధుమేహాన్ని అదుపు చేయడం ప్రతి ఒక్కరికీ పెద్ద పనిగా మారింది. మధుమేహం నియంత్రణకు కొందరు అల్లోపతి మందులు వాడితే, మరికొందరు ఆయుర్వేదాన్ని ఆశ్రయిస్తున్నారు.

కానీ మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలు మధుమేహాన్ని అదుపులో ఉంచేందుకు ఎంతో మేలు చేస్తాయని కూడా చెబుతున్నారు. అలాంటి వాటిలో బిర్యానీ ఆకు ఒకటి.

వయసుతో నిమిత్తం లేకుండా మధుమేహంతో బాధపడేవారు జీవనశైలిలో మార్పులతో పాటు సహజసిద్ధమైన ఆహారాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.

మధుమేహ వ్యాధిగ్రస్తులు బిర్యానీ ఆకును రోజుకు మూడుసార్లు తింటే ప్రయోజనం ఉంటుంది. షుగర్ అదుపులోకి వస్తుంది. అసలు బిర్యానీ ఆకుతో షుగర్ ఎలా కంట్రోల్ లోకి వస్తుంది. ఏం చేయాలి?

ఒక గిన్నెలో 10 బిర్యానీ ఆకులు తీసుకుని మూడు గ్లాసుల నీళ్లు పోసి పది నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్‌పై నుంచి దించి రెండు మూడు గంటల పాటు చల్లారనివ్వాలి. బిర్యానీ ఆకుల్లోని ఔషధ గుణాలు నీటికి తోడయ్యాయి. తర్వాత ఆకులను తీసి బిర్యానీ ఆకులతో చేసిన కషాయాన్ని అరగ్లాసు చొప్పున రోజుకు మూడుసార్లు తాగాలి.

ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనానికి గంట ముందు ఒకటి నుంచి మూడు రోజులు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఆ తర్వాత మళ్లీ రెండు వారాల గ్యాప్ ఇచ్చి మళ్లీ వరుసగా మూడు రోజులు క్రమంగా వాడాలి. ఇలా రెండు సార్లు చేస్తే షుగర్ అదుపులో ఉంటుంది. ఇలా చేయడంతో పాటు, షుగర్‌ను నియంత్రించడానికి మీరు మీ జీవనశైలిని మార్చుకోవాలి.

కనీసం అరగంట నుంచి గంటసేపు వ్యాయామం చేయాలి. చిరుతిళ్లు తీసుకోవడం, నూనె పదార్థాలు తక్కువగా ఉండడం, తగినంత నిద్రపోవడం, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. కానీ సహజ పద్ధతులతో మధుమేహాన్ని నయం చేసేందుకు ప్రకృతి వైద్యులను సంప్రదించాలి

Flash...   Learn A Word A Day March 2023 Words list