మీ ఫోన్‌లో నెట్ రాకెట్ స్పీడ్‌గా ఉండాలా.. ? ఈ సెట్టింగ్స్​ మార్చండి..

మీ ఫోన్‌లో నెట్ రాకెట్  స్పీడ్‌గా ఉండాలా.. ? ఈ సెట్టింగ్స్​ మార్చండి..

How to Increase Mobile Internet Speed :

మీ ఫోన్‌లో ఇంటర్నెట్ స్పీడ్ తక్కువగా ఉందా? టెన్షన్ లేదు! ఫోన్‌లో కొన్ని సెట్టింగ్‌లను మార్చడం ద్వారా మీరు సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్‌ను పొందవచ్చు. అనేది  తెలుసుకుందాం.

How to Increase Mobile Internet Speed :

ఇది స్మార్ట్ యుగం. అందరి చేతిలోనూ స్మార్ట్ ఫోన్ ఉంటుంది అయితే.. చాలా మందిని వేధిస్తున్న సమస్య.. ఇంటర్నెట్ స్లో! ఏదైనా సమాచారం కోసం వెతుకుతున్నా.. UPI చెల్లింపులు చేస్తున్నప్పుడు.. ఆన్ లైన్ లో సినిమాలు చూస్తున్నప్పుడు.. నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే ఇబ్బందిగా ఉంటుంది. మీరు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా? మీ ఫోన్‌లో నెట్ స్పీడ్ బాగా లేదా? అయితే కొన్ని సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా ఇంటర్నెట్ స్పీడ్ పెంచుకోవచ్చని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. మరి.. ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Follow these tips to increase internet speed:

మీ స్మార్ట్‌ఫోన్‌లో నెట్ స్పీడ్ తక్కువగా ఉంటే, ముందుగా ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల నెట్ స్పీడ్ పెరుగుతుంది. తర్వాత.. ఫోన్‌లో క్రాష్, కుకీలను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలి. స్మార్ట్‌ఫోన్‌లో డేటా సేవింగ్ మోడ్‌ను ఆన్ చేయండి. ఇలా చేయడం వల్ల ఇంటర్నెట్ బ్రౌజింగ్ కూడా స్పీడ్ అవుతుంది.
ఒకే సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా యాప్‌లను రన్ చేయడం వల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగ్గుతుంది. కాబట్టి, బ్యాక్‌గ్రౌండ్ యాప్‌లను మూసివేయాలి.

కొంతమంది స్మార్ట్‌ఫోన్‌లో ఆటోమేటిక్ అప్‌డేట్ సెట్టింగ్‌ని యాక్టివేట్ చేస్తారు. దీనివల్ల ఇంటర్నెట్ స్పీడ్ తగ్గవచ్చు. కాబట్టి ఆటో అప్‌డేట్ సెట్టింగ్‌ను ఆఫ్ చేయండి. ఫోన్‌లోని డేటా సెట్టింగ్‌లను తనిఖీ చేయండి. మీది 5జీ స్మార్ట్ ఫోన్ అయితే.. డేటా సెట్టింగ్ 4జీ నెట్ వర్క్ లో ఉన్నా నెట్ స్పీడ్ తక్కువగానే ఉంటుంది. మీ ఫోన్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందినట్లయితే, వాటిని దాటవేయవద్దు. వెంటనే ఇన్‌స్టాల్ చేయండి. ఇది ఇంటర్నెట్ స్పీడ్‌ని మెరుగుపరుస్తుంది.

Flash...   UDISE + (Unified District Information System for Education) 2022 INSTRUCTIONS

చాలా ఫోన్‌లు డజన్ల కొద్దీ యాప్‌లను కలిగి ఉంటాయి. కానీ.. అందులో వాడేవి కొన్ని మాత్రమే. మీ ఫోన్‌లో కూడా ఉలా ఉంటే.. ఉపయోగించని యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. ఇది ఖాళీని క్లియర్ చేస్తుంది. నెట్ స్పీడ్ కూడా పెరుగుతుంది.

నెట్‌వర్క్ సరిగా రాకపోతే..

కొన్ని నిమిషాల పాటు ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచండి. అప్పుడు సాధారణ మోడ్‌ను సెట్ చేయండి. నెట్ సమస్యను పరిష్కరించడానికి ఇది త్వరిత మరియు ప్రభావవంతమైన చిట్కా.
ఇంత చేసినా నెట్ స్పీడ్ రాకపోతే.. ఒకసారి సిమ్ తీసేసి మళ్లీ ఇన్సర్ట్ చేయండి. ఇలా చేయడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది.

మీరు రెండు సిమ్ కార్డులు వాడుతున్నట్లయితే.. సెట్టింగ్‌లలో అందుబాటులో ఉన్న ఉత్తమ నెట్‌వర్క్‌ను ఎంచుకోండి. మీ డేటా పరిమితిని చేరుకున్నప్పటికీ, నెట్ వేగం తగ్గవచ్చు. ఆపై మరింత డేటా కోసం ఇతర ప్లాన్‌లను అప్‌గ్రేడ్ చేయండి.