Dry Fruits Benefits : సీతాకాలంలో తప్పకుండా తినాల్సిన హెల్దీ డ్రై ఫ్రూట్స్ ఇవే!

Dry Fruits Benefits : సీతాకాలంలో తప్పకుండా తినాల్సిన హెల్దీ డ్రై ఫ్రూట్స్ ఇవే!

అన్ని కాలాలు వేరు.. చలి కాలం వేరు. ఈ చలికాలంలో ముఖ్యంగా ఆరోగ్యం, ఆహారం విషయంలో రకరకాల జాగ్రత్తలు తీసుకోవాలి. చలి కాలంలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది.

అలాగే జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మితమైన ఆహారం తీసుకోవాలి. అలాగే చర్మంలో కూడా మార్పులు వస్తాయి. చలి కారణంగా చర్మం పొడిబారడం, గీతలు, డల్ గా మారుతుంది. కాబట్టి చలికాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఈ డ్రై ఫ్రూట్స్ ఎంతగానో సహకరిస్తాయి. ఇప్పుడు తెలుసుకుందాం.

బాదం:

బాదంలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఇ, మెగ్నీషియం మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. చలికాలంలో వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి.

Dates: 

చలి కాలంలో ఖర్జూరాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో సహజ స్వీటెనర్ ఉంటుంది. దీన్ని తిన్న వెంటనే రోగనిరోధక శక్తితో పాటు ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ఖర్జూరాలను స్నాక్స్‌గా కూడా తీసుకోవచ్చు. అంతే కాకుండా స్మూతీస్ మరియు డెజర్ట్‌లలో కూడా ఉపయోగించవచ్చు.

ఎండుద్రాక్ష:

చలికాలంలో ఎండు ద్రాక్ష తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ద్రాక్షలో ఐరన్, పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి చలికాలంలో వీటిని తింటే మంచి ప్రయోజనాలు చేకూరుతాయి.

డ్రై ఆప్రికాట్లు:

ఎండిన ఆప్రికాట్‌లలో విటమిన్ ఎ, పొటాషియం మరియు డైటరీ ఫైబర్‌లు అధికంగా ఉంటాయి. వీటిని స్నాక్స్ మరియు సలాడ్లలో ఉపయోగించవచ్చు.

వాల్ నట్స్:

వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ఐరన్ మరియు మాంగనీస్ వంటి ముఖ్యమైన పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చలికాలంలో వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు చర్మం కూడా మెరుగుపడుతుంది.

గమనిక: ఈ సమాచారం నిపుణులు మరియు అధ్యయనాల నుండి సేకరించబడింది. ఈ వ్యాసం అవగాహన కోసం మాత్రమే. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా వైద్యులను సంప్రదించడం మంచిది

Flash...   హలో.. మీ బ్యాంకు నుంచి మాట్లాడుతున్నా!