Food: చలికాలం మొక్క జొన్నలు (sweet corn) కచ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా?

Food: చలికాలం మొక్క జొన్నలు (sweet corn) కచ్చితంగా తినాల్సిందే.. ఎందుకో తెలుసా?

రోజు రోజు కు చలి విపరీతం గా పెరుగుతుంది . జనాలకి జలుబుతో పాటు అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చలికాలంలో జీర్ణవ్యవస్థ, గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువగా చూస్తూ ఉంటాము .

కానీ కాలక్రమేణా వచ్చే ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు స్వీట్ కార్న్ (జొన్న) ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సీజన్ తో సంబంధం లేకుండా ప్రతి సీజన్ లో దొరికే ఈ జొన్నలను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. చలికాలంలో జొన్నలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను చూద్దాం

* సాధారణంగా చలికాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్యలు జీర్ణవ్యవస్థకు సంబంధించినవి. మిల్లెట్‌లో ఉండే ఫైబర్ జీర్ణ సమస్యలకు క్లియర్ చేస్తుంది . రోజూ క్రమం తప్పకుండా మొక్కజొన్న తీసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు వుండవు .

* కార్డియోవాస్కులర్ వ్యాధులు కూడా చలికాలంలో ఎక్కువగా వస్తుంటాయి. అలాంటి వారికి మొక్కజొన్న మంచి ఔషధం గా ఉపయోగపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

* Blood Sugar సమస్యతో బాధపడే వారికి కూడా జొన్నలు సరైనవి. Type 2 Diabetis బాధితులకు మొక్కజొన్న చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. జొన్నలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రక్తంలో glucose స్థాయిలు తగ్గుతాయి.

* చలికాలం కంటి సంబంధిత సమస్యలను కూడా తెస్తుంది. ఇలాంటి సమస్యలకు జొన్నలు బాగా ఉపయోగపడతాయి. మొక్కజొన్నలో ఉండే లుటీన్ కళ్లకు మేలు చేస్తుంది.

మొక్కజొన్నలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

Flash...   వాట్సాప్‌ కొత్త పాలసీపై విచారణ.. ఆదేశించిన ప్రభుత్వం!