Free Training for unemployed : నిరుద్యోగ యువతకు 3 నెలల పాటు ఉచిత శిక్షణ .. ఎక్కడంటే..

Free Training for unemployed : నిరుద్యోగ యువతకు 3 నెలల పాటు ఉచిత శిక్షణ .. ఎక్కడంటే..

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వారి కాళ్లపై వారు నిలబడేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వివిధ కంపెనీల్లో ఉచిత ఉపాధి శిక్షణ,

నియామకాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువజన శిక్షణ కేంద్రాన్ని నైపుణ్య కళాశాలగా మార్చారు.

ఇక్కడ అవసరమైన వివిధ శిక్షణలు ఇస్తారు. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన మరియు స్కిల్ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్ మొదటి దశలో ఫ్రంట్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ (FOE) మరియు ఫుడ్ అవుట్‌లెట్ మేనేజర్ (FOM) కోర్సులలో 30 మంది చొప్పున మొత్తం 60 మంది పురుష మరియు స్త్రీ అభ్యర్థులకు శిక్షణనిస్తున్నాయి. ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులు. వారికి ప్రత్యేక శిక్షకుల ద్వారా బోధిస్తారు.

ఇదే శిక్షణ ప్రయివేటు సంస్థలు ఇస్తే ఒక్కో అభ్యర్థికి మూడు నెలల పాటు లక్షల్లో ఖర్చు అవుతుంది. పైసా ఖర్చు లేకుండా నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శిక్షణ ఇస్తోంది. ఆ తర్వాత శిక్షణ సర్టిఫికెట్లు కూడా మంజూరు చేస్తారు.

Flash...   PGCIL: పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ లో 159 ఉద్యోగాలు.. జీతం ఎంతో తెలుసా..