Health Tips : చలికాలంలో అంజీరాలను తప్పకుండా ఇలా తీసుకోండి .. బోలెడు ప్రయోజనాలు..

Health Tips : చలికాలంలో అంజీరాలను తప్పకుండా ఇలా తీసుకోండి .. బోలెడు ప్రయోజనాలు..

పోషకాలు పుష్కలంగా ఉండే అంజీర పండ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. వీటిని పచ్చిగా తీసుకోవచ్చు..

అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా తీసుకోవచ్చు.. అందుకే వీటిని రోజుకు ఒక్కసారైనా తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.. నానబెట్టిన అంజీర పండ్లను ప్రతి రోజూ ఈ శీతాకాలంలో ఉదయం అనేక ఆరోగ్య ప్రయోజనాలను తెస్తుంది. ఈ పండ్లు మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి.. ఇప్పుడు వీటిని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..

దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలు తరచూ వస్తుంటాయి. చలికాలంలో మనల్ని మనం రక్షించుకోవడానికి మన ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆహారం తీసుకోవాలి..ఇందులో అంజీర పండ్లను అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు..రాత్రి కప్పు నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఉదయం తింటే మన శరీరానికి అనేక రకాల పోషకాలు అందుతాయి. వీటిని ఇతర డ్రై ఫ్రూట్స్‌తో కలిపి తినవచ్చు.

ముఖ్యంగా అత్తి పండ్లలో విటమిన్ ఎ, పొటాషియం మరియు ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే చలికాలంలో చర్మం ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తింటే..
ఎముకల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వీటిలో కాల్షియం మరియు ఫాస్పరస్ పుష్కలంగా ఉంటాయి మరియు అధిక రక్తపోటును నియంత్రించడంలో పొటాషియం కీలక పాత్ర పోషిస్తుంది. కానీ అంజీర్‌లో పుష్కలంగా ఉంటుంది.. మలబద్ధకం సమస్యతో బాధపడేవారికి అంజీర్ ఔషధంలా పనిచేస్తుంది.. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. అనేక ఇతర సమస్యలను తగ్గిస్తుంది.. రోజుకు రెండు నానబెట్టిన పండ్లను తీసుకుంటే మంచిది..

Flash...   Year Ending Discounts: ఈ ప్రముఖ బ్రాండ్ల CNG కార్లపై అదిరిపోయే ఆఫర్లు.. భారీ తగ్గింపులు.!