Health: To drive away the new variant of Corona, boost immunity like this..
కోవిడ్ 19 సబ్-వేరియంట్ JN1 ప్రస్తుతం భయాందోళనలకు గురిచేస్తోంది. యాక్టివ్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా, JN1 వేరియంట్ న్యూ ఇయర్‌లో భయానక వాతావరణాన్ని సృష్టిస్తోంది.
కేరళలో వెలుగులోకి వచ్చిన ఈ కొత్త వేరియంట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దేశంలో ఇప్పటికే యాక్టివ్ కేసుల సంఖ్య 4 వేలకు చేరుకోవడం ఆందోళనకరం.
ఈ నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్ బారిన పడకుండా ఉండాలంటే రోగనిరోధక శక్తిని పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. సహజంగా రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1.తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తిని పెంచడంలో కొన్ని రకాల ఆహార పదార్థాలు ముఖ్యంగా ఉపయోగపడతాయి. బీటా కెరోటిన్ మరియు విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. నారింజ, నిమ్మ పండ్లను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
2.క్రమం తప్పకుండా వ్యాయామం. రోజులో కనీసం గంటపాటు ఏదో ఒక వ్యాయామం చేయాలని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం చేయకపోయినా వీలైనంత వరకు నడవడానికి ప్రయత్నించండి అంటున్నారు నిపుణులు. మొత్తం మీద శారీరక శ్రమను పెంచుతుందని అంటున్నారు.
3.వైరస్ బారిన పడకుండా, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవాలంటే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి సరిపడా నీరు తీసుకోవాలని సూచించారు. శరీరం ఎల్లప్పుడూ హైడ్రేట్ గా ఉంటే అది శరీరంలోని ప్రమాదకరమైన టాక్సిన్స్ ను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలని చెప్పారు.
4.రోగ నిరోధక శక్తిని పెంచడంలో నిద్ర ముఖ్యపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్ర ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలరు. ఆరోగ్యవంతమైన పెద్దలు రోజుకు కనీసం 7 నుండి 8 గంటలు నిద్రపోవాలని చెబుతారు. నిద్రలేమితో బాధపడే వారి రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
5.మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒత్తిడి నుంచి బయటపడేందుకు ధ్యానం, యోగా వంటివి చేయాలని చెప్పారు. మానసిక ఆరోగ్యం బాగుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందన్నారు.
గమనిక: పై సమాచారం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్య విషయంలో వైద్యుల సూచనలు పాటించడం మంచిది.