చలికాలం లో “హార్ట్ అటాక్” వచ్చేఅవకాశం ఎక్కువ ! ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి !

చలికాలం లో “హార్ట్ అటాక్” వచ్చేఅవకాశం  ఎక్కువ ! ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి !

ఈ నెల నుండి ఫిబ్రవరి వరకు చలికాలం ఉంటుంది. ఈ చలికాలంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, వీటికి చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే చాలు.

కానీ చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చలికాలంలో విపరీతమైన చలి వల్ల రక్తనాళాలు బిగుసుకుపోయి బీపీ పెరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని వైద్యులు పదే పదే చెబుతుంటారు.

ఇది కాకుండా, మీ బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే ఏదైనా మందులు మార్చాల్సిన అవసరం ఉందా అనే విషయంపై కూడా మీకు అవగాహన వస్తుంది. ఇక అన్ని రోగాలకు ప్రధాన కారణమైన డ్రగ్స్, సిగరెట్లకు పూర్తిగా దూరంగా ఉండటం వల్ల చాలా రోగాలు దరిచేరవు

Flash...   మీ గుండె పదిలం గా ఉండాలంటే ఇది తినాల్సిందే..