IDBI Bank Recruitment 2023: రాత పరీక్ష లేకుండానే స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. జీతం నెలకి 63 వేలు

IDBI Bank Recruitment 2023: రాత పరీక్ష లేకుండానే స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. జీతం నెలకి 63 వేలు

ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు.. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (IDBI) పలు ఉద్యోగాల భర్తీకి Notification విడుదల చేసింది.

ఇందులో భాగంగా మొత్తం 86 స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

రాత పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవచ్చు. Group Discussion , Interview ల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

బ్యాంకు ఖాతాదారులకు అందించే సేవలను సులభతరం చేయడం మరియు లావాదేవీలను సులభతరం చేయడం స్పెషలిస్ట్ అధికారుల విధి. వారు మార్కెటింగ్, ATM, ట్రేడ్ ఫైనాన్స్, ట్రెజరర్, సెక్యూరిటీ, డేటా అనలిస్ట్ మొదలైన విభాగాల క్రింద బాధ్యత వహిస్తారు.

మొత్తం పోస్టుల సంఖ్య: 86

పోస్టుల వివరాలు: పోస్టులు

  • మేనేజర్ – గ్రేడ్ B – 46 పోస్టులు,
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) – గ్రేడ్ C – 39
  • డిప్యూటీ జనరల్ మేనేజర్ (DGM) – గ్రేడ్ D – 01.

QUALIFICATION:

సంబంధిత పోస్టులకు ఉద్యోగానుభవంతో పాటు సంబంధిత విభాగంలో సీఏ, ఎంబీఏ, సీఎఫ్‌ఏ, ఎఫ్‌ఆర్‌ఎం, ఐసీడబ్ల్యూఏ, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత.

AGE:

  • 01.11.2023 నాటికి మేనేజర్ పోస్టులకు 25-35 ఏళ్లు,
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు 28-40 ఏళ్లు
  • మరియు డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులకు 35-45 ఏళ్ల మధ్య ఉండాలి.

SALRAY :

  • డిప్యూటీ జనరల్ మేనేజర్‌కు Rs.76,010–.89,890.
  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్‌కు Rs.63,840 – .78,230.
  • మేనేజర్‌కు Rs.48,170–Rs69,810.

Selection Process:

ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులలో విద్యార్హతలు, పని అనుభవం మరియు ఇతర వివరాల ఆధారంగా అభ్యర్థులు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను గ్Rsప్ డిస్కషన్ (GD)/పర్సనల్ ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జరుగుతుంది.

ముఖ్యమైన సమాచారం

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 25.12.2023

Flash...   ఐటిఐ అర్హత తో ఇస్రో లో ఉద్యోగాలు .. చివరి తేదీ డిసెంబర్ 31 .. అప్లై చేయండి

వెబ్‌సైట్: https://www.idbibank.in/