వాము ఆకులను ఇలా వాడితే ఎన్ని ప్రయోజనాలో.. ఆ సమస్యలకు చెక్..

వాము ఆకులను ఇలా వాడితే ఎన్ని ప్రయోజనాలో.. ఆ సమస్యలకు చెక్..

వాము గురించి మీరు వినే ఉంటారు..

రోజూ వాము తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఈ వాము ఆకులను ఉపయోగించి రకరకాల వంటకాలు కూడా తయారుచేస్తారు. కానీ ఈ మొక్కను ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కడుపునొప్పి, దగ్గు, జలుబు తగ్గేందుకు ఈ వాము ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి..

ఇప్పుడు ఈ వాము ఆకు తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం..

వీటిని నిత్యం వాడితే బాగుంటుంది..
కరివేపాకు, కొత్తిమీర వాడినట్లే వాము ఆకులను కూరల్లో వాడితే మంచి ఫలితం ఉంటుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరం మరియు కడుపులో గ్యాస్ వంటి సమస్యలు తొలగిపోతాయి. మలబద్ధకం కూడా తగ్గుతుంది. పేగుల్లో అల్సర్ల వంటి నొప్పిని కూడా తగ్గిస్తుంది. వామాకులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి, ప్రోటీన్లు, కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి.

ఇందులో పీచు సమృద్ధిగా ఉంటుంది.. బరువును కూడా తగ్గిస్తుంది..వామకులో విటమిన్లు ఎ, బి, సి, అమినో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం ఉంటాయి కాబట్టి మంచి పోషకాహారం. వాము ఆకు తలనొప్పికి ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఆకులను నొప్పి ఉన్న ప్రదేశంలో రుద్దితే తలనొప్పి తగ్గుతుంది.

ఈ ఆకులు సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి.. వీటిని చట్నీలు, జ్యూస్‌లు, బజ్జీలు, పకోడీలు, కూరల్లో ఎక్కువగా ఉపయోగించవచ్చు. ఈ ఆకులు ఆయుష్షును పెంచుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

ఈ వాము ఆకులను నిత్యం వాడే వారికి దగ్గు, జలుబు అస్సలు రావు. వస్తే పది ఆకులను కడిగి వేడినీళ్లలో వేసి మరిగించాలి. ఈ నీటిని బాగా మరిగించి వడకట్టి.. కావాలంటే తేనె కూడా వేసుకోవచ్చు.. దీన్ని ప్రతిరోజూ తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి..

Flash...   Diabetes Care: షుగర్ ఉన్నవారు ఖర్జూరపండ్లను తింటే ఏమవుతుంది …