అంగన్ వాడీలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ – ఈ డిమాండ్లపై ఉత్తర్వులు జారీ..

అంగన్ వాడీలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ – ఈ డిమాండ్లపై ఉత్తర్వులు జారీ..

ఆంధ్రప్రదేశ్ లో అంగన్‌వాడీ హెల్పర్లకు అంగన్‌వాడీ వర్కర్లుగా పదోన్నతి కల్పించేందుకు వయోపరిమితిని పెంచుతూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం అంగన్‌వాడీ హెల్పర్‌లను అంగన్‌వాడీ కార్యకర్తలుగా పదోన్నతి కల్పించేందుకు ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న 45 ఏళ్ల వయోపరిమితిని 52 ఏళ్లకు పెంచింది. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు టీఏ, డీఏలు చెల్లించాలని మరో ఉత్తర్వు జారీ చేసింది.

ఇటీవల జరిగిన మంత్రివర్గ చర్చల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ రెండు ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో పలు డిమాండ్ల సాధన కోసం ఇప్పటికే అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు ఆందోళనలు చేస్తున్నారు. ఇవి జోరందుకోవడంతో ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. మిగిలిన డిమాండ్లపై ప్రభుత్వం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాల తాళాలు పగులగొట్టే ఆందోళనల నేపథ్యంలో సర్కార్ తాజా ఉత్తర్వులు ఉపశమనం కలిగించాయని చెప్పవచ్చు.

Flash...   School Complex meeting: November స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్ టైంటేబుల్, షెడ్యూల్ ఇదే..